కులరహిత సమాజంకై ఉద్యమిద్దాం !
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 28(ప్రతినిధి మాతంగి సురేష్)కొమరబండ గ్రామంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య పిలుపులో భాగంగా,అరుణోదయ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ 151 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రూప్ మీటింగ్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా అరుణోదయ జిల్లా అధ్యక్షులు ఉదయగిరి మాట్లాడుతూ భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి కుల వ్యవస్థ ఉన్నదని ఇది నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ అని అన్నారు. ముఖ్యంగా అణగారిన వర్గాలైన కింది కులాలకు సంబంధించిన ప్రజలు అనేక వివక్షతకు దాడులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉందన్నారు,విజ్ఞానం అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా కులం పేరుతో నేటికీ అనేక చోట్ల దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వాలకు కుల వివక్షతను రూపుమాపడంలో చిత్తశుద్ధి లేదని అన్నారు పాలకులే ప్రజలను కులాల పేరుతో మతాల పేరుతో విభజిస్తున్న పరిస్థితి ఉందని అన్నారు.ఈ కుల వివక్షతకు వ్యతిరేకంగా ప్రజలంత చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉందని,కుల వ్యవస్థ అంతంకై పోరాడిన అనేకమంది మహనీయుల స్ఫూర్తితో ఉద్యమిద్దమని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కామళ్ళ సైదులు,మద్దెల ప్రతాప్,మద్దెల వెంకన్న,రజనీ కుమార్,అనంతరావు,బొబ్బయ్య,శీను తదితరులు పాల్గొన్నారు