ఆర్టీసీ బస్సులో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 28 (ప్రతినిధి మాతంగి సురేష్): కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ (RTC) బస్సు సూర్యాపేట నుంచి కోదాడకు వచ్చుచుండగా బస్సులో ప్రయాణం చేస్తున్న కోదాడ మండలం గుడిబండ గ్రామానికి చెందిన మహిళ అలివేలు పురిటి నొప్పులతో (Back pain)బాధపడుచుండగా ఆర్టీసీ సిబ్బంది స్పందించి బస్సును పక్కకు ఆపి తోటి మహిళా ప్రయాణికుల (Female passengers) సహాయంతో ఆమెకు సుఖవంతమైన ప్రసవం అయినది.ఆమె పండంటి ఆడబిడ్డ (మహాలక్ష్మి )కు జన్మనిచ్చింది.వెంటనే సిబ్బంది 108కు కాల్ చేసి ఆమెను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించినారు.ఇప్పుడు తల్లి బిడ్డ ఆరోగ్యం క్షేమంగా ఉన్నారు.కోదాడ డిపో మేనేజర్ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకొని వెంటనే స్పందించిన కోదాడ డిపో డ్రైవర్ కండక్టర్లను అభినందించారు.