సూర్యాపేట జిల్లా(mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు): తుంగతుర్తి మండలం కేశవపురం వాసి కుటుంబ రావు అనే వ్యక్తి సోమవారం సాయంత్రం తుంగతుర్తి సంతకు వచ్చి తీరుగి వెలుగుపళ్లి మీదుగా తన సొంత ఊరికి వెళుతూ వేలుగుపల్లి గ్రామ శివారు లోని చిత్తలూరి వారి బందం వద్ద గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నీళ్ళు పారుతుంటే అక్కడ పాకురు పట్టి ఉండటం వలన బంధం దాటుతున్న సమయంలో కాలు జారీ, కింద .పడటం వల్ల చలా పెద్దగానే గాయం తగిలింది.అక్కడ కొంత మంది యువకులు ఉండటంతో వెంటనే తుంగతుర్తి ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లి మెరుగైన వైద్యం చేయించారు. ఏది ఏమైనా బంధం మరమ్మత్తులను తక్షణమే స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్ పెద్ద మనసుతో , కాంట్రాక్టర్ తో యుద్ధ ప్రాతిపదికన నూతన మోరీలు వేసి, మరమ్మత్తు పనులు నిర్వహించాలని గ్రామస్తులు వివిధ పార్టీ నాయకులు కోరుతున్నారు.