బతుకును ఇచ్చే పండుగ బతుకమ్మ..
:చెరువుకు బతుకమ్మకు గొప్ప అనుబంధం ఉంది.
:బతుకమ్మను భవిషత్తు తరాలకు అందింద్దాం.. చెరువులను కాపాడుకుందాం..
:చెరువులను పరిరక్షించే బాధ్యత అధికారులపై ఉంది:మంత్రి సీతక్క
Mbmtelugunews//హైదరాబాద్,అక్టోబర్ 09:నాంపల్లిలోని టీజీఓ భవన్ లో టీజీఓ కేంద్ర సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలులో మంత్రి సీతక్క పాల్గొని ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు.
మనకు పూర్వికులు ఇచ్చిన గొప్ప ఆచారం, సంకృతి బతుకమ్మ..
బతుకును ఇచ్చే పండుగ బతుకమ్మ.. భవిష్యత్తు తరాలకు ఈ పండుగను అందించడమే మన బాధ్యత..
చెరువులను కబ్జాలు కాకుండా కాపాడుకుందాం.
ఈ రోజు చెరువులు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది.
చెరువులకు పూజలు చేసే పండుగ బతుకమ్మ..
తెలంగాణ అంటేనే చెరువులు.. బతుకమ్మ
చెరువులలో నీరు తాగేది..పొలాలకు నీరు అందించేది.
మన జీవన శైలి చెరువుల పై ఆధారపడేది.
హైదరాబాద్ కు లేక్ సిటీ అనే పేరు ఉండే.. కానీ ఈ రోజు అవి కనుమరుగు అయిపోయాయి.
ఆటలు..పాటలు..బతుకమ్మకు పూజలు..ఇది తరతరాలకు అందించాల్సిన అవసరం ఉంది.