పిఆర్టియు టీజిఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా రెండవసారి మాతంగి ప్రభాకర్ రావు ఎన్నిక
Mbmtelugunews//కోదాడ,అక్టోబర్ 09(లోకంతీరు):హైదరాబాదులో జరిగిన ప్రోగ్రెసివ్ రికగ్నైజ్ డు టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్(పిఆర్టియు టీజీఎస్) 35వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో కోదాడ పట్టణానికి చెందిన మాతంగి ప్రభాకర్ రావు ప్రభుత్వ ఉన్నత పాఠశాల హుజూర్ నగర్ స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నరు.పిఆర్టియు టిజిఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా2024-2026 విద్య సంవత్సరానికి హైదరాబాదులో ప్రమాణ స్వీకారం చేసినారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించిన పిఆర్టియు టిజిఎస్ సంఘం మండల జిల్లా రాష్ట్ర సీనియర్,మాజీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.సంఘ బలోపేతానికి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తన బాధ్యతగా కృషి చేస్తానని అన్నారు.