ఇసుక లారీ కిందపడి వ్యక్తి దుర్మరణం
Mbmtelugunews//భూపాలపల్లి,అక్టోబర్ 17:భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం బెగ్లూరు గ్రామానికి చెందిన దోమల రమేష్,ముల్కల లక్ష్మీనారాయణ అను ఇద్దరు కలిసి పొలం వద్దకు వెళ్దామని తన బైక్ పై వెళ్తుండగా మార్గమధ్యంలో 12 గంటల సమయంలో ఎల్&టీ రోడ్డు వద్దకు రాగానే అప్పుడే సూరారం వైపు నుండి కుదురుపల్లి వైపు వెళ్తున్న ఇసుక లారీ నెంబర్ TS-16-UD-1899 గల దానిని లారీ డ్రైవర్ అతివేగంగా నడిపి బైక్ ను ఢీకొట్టగా దోమల రమేష్ లారీ ముందు టైరు కింద పడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.బైక్ వెనకాల కూర్చున్న ముల్కల లక్ష్మీనారాయణ తలకు దెబ్బలు తగలగా మహదేవపూర్ హాస్పిటల్ లో చికిత్స చేయిస్తున్నారు.మృతుని భార్య దోమల జ్యోతి ఫిర్యాదు మేరకు మహాదేవపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.