జిల్లాస్థాయి కళా ఉత్సవ్
పోటీలో కోదాడ బాయ్స్ హై స్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపిక……
:కళా ఉత్సవ్ రాష్ట్రస్థాయికి ఎంపికైన కోదాడ విద్యార్థులకు ఎంఈఓ ఎండి సలీం షరీఫ్ అభినందనలు……
Mbmtelugunews//కోదాడ,అక్టోబర్ 18(ప్రతినిధి మాతంగి సురేష్):గత రెండు రోజులుగా జిల్లా విద్యాశాఖ నేతృత్వంలో జరిగిన కళా ఉత్సవ్ పోటీలలో కోదాడ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన 3గురు విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పట్ల మండల విద్యాధికారి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎండి సలీం షరీఫ్,పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు డి మార్కండేయ,జిల్లా సైన్స్ అధికారి ఎల్ దేవరాజు,ఉపాధ్యాయులు శుక్రవారం నాడు విద్యార్థులుకు అభినందనలు తెలియజేశారు.ఇదే స్ఫూర్తితో రాష్ట్రస్థాయిలో విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు.ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ పోటీ విభాగంలో పి.అక్షయ్ 9వ తరగతి బాలుర ఉన్నత పాఠశాల కోదాడ,విజువల్ ఆర్ట్స్ కేటగిరీలో 3డి ఆర్ట్స్ నందు ఎస్ డి సాదిక్ 9 వ తరగతి బాలుర ఉన్నత పాఠశాల కోదాడ,ట్రెడిషనల్ స్టోరీ టెల్లింగ్ కేటగిరి నందు పి హరీష్ కుమార్ 9వ తరగతి బాలుర ఉన్నత పాఠశాల కోదాడ విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికైన సందర్భంగా విద్యార్థులకు అభినందనలు తెలియజేసినారు,నవంబరు 1,2 తేదీలలో జరిగే రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలవాలని ఆకాంక్షిస్తూ,విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.