జిల్లా గ్రంథాలయాలను దేవాలయాల గా మారుస్తా: వంగవీటి రామారావు
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 19(ప్రతినిధి మాతంగి సురేష్):జిల్లా గ్రంథాలయాలను దేవాలయాల గా మార్చి వాటి అభివృద్ధికి కృషి చేస్తా అని వంగవీటి రామారావు అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని మాజీ సర్పంచ్ యెర్నేని వెంకటరత్నం (బాబు)నివాసంలో సూర్యాపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా ఎన్నికైన వంగవీటి రామారావుకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.అనంతరం మాజీ సర్పంచ్ యెర్నేని వెంకటరత్నం బాబు మాట్లాడుతూ కోదాడ ప్రాంత వాసిని జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా నియమించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి అభినందనలు తెలిపారు.విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగ పడతాయని అన్నారు. కోదాడ గ్రంథాలయంలో ఎంతోమంది విద్యార్థులు చదివి పోటీ పరీక్షలలో విజయం సాధించి నేడు ఉన్నత ఉద్యోగాలు పొందారని గుర్తు చేశారు.అన్ని వసతులతో గ్రంథాలయాలను అభివృద్ధి చేయాలని కోరారు.గతంలో గ్రంథాలయాల్లో సరియైన వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. అనంతరం జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా ఎన్నికైన వంగవీటి రామారావు మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా తనను నియమించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అభినందనలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రంథాలయాలను అభివృద్ధి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో వంటిపులి వెంకటేష్ ,చందు నాగేశ్వరావు ఖాజా మొయినుద్దీన్,వంటిపులి శ్రీను,నెమ్మది దేవమని,సైదా బాబు, సత్యనారాయణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.