ధాన్యం కొనుగోలు కి 20,000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం….
:రైతన్నలు ఇబ్బంది పడకుండా రాష్ట్రం లో 7500 ధాన్యం కొనుగోలు కేంద్రాలు.
:రాష్ట్ర నీటి పారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి
Mbmtelugunews//సూర్యాపేట,నవంబర్ 04 (ప్రతినిధి మాతంగి సురేష్)రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం నిశ్చయంగా ఉందని, రికార్డు స్థాయిలో ఈసారి ధాన్యం దిగుబడి అయినదని,రైతుల నుండి ప్రతి గింజ సేకరిస్తామని దీనికోసం 20,000 కోట్లను ప్రభుత్వం సిద్ధం చేసిందని రాష్ట్ర నీటి పారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రం డిఎస్పి కార్యాలయ ప్రారంభం అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మంత్రి మాట్లడుతూ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా చూస్తామని తెలిపారు. రాష్ట్రంలో 7500 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్ని కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రైతులకు చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని 500 బోనస్ ఇస్తున్నామన్నారు.రాష్ట్రంలో 2.20 కోట్ల లబ్ధిదారులకి ఉచిత బియ్యం ఇవ్వడానికి బియ్యం నాణ్యత పెంచామని అందరికీ సంక్రాంతి తర్వాత సన్నబియ్యం ఉచితంగా ఇస్తామని దీనికోసం సన్నబియాన్ని సేకరిస్తున్నామని సన్నబియ్యం సేద్యం చేసేలా రైతులకు 500 రూపాయల బోనస్ ప్రకటించామని అన్నారు.ధాన్యం కొనుగోలు విషయంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.ఉమ్మడి జిల్లాలలో ధాన్యం సేకరణకు సీనియర్ ఐఏఎస్ అధికారులను ఏర్పాటు చేశామని ఈ స్థాయిలో ధాన్యం సేకరణ ఎప్పుడు జరగలేదని మిల్లర్లకు కూడా ఇబ్బంది లేకుండా ధరలు పెంచుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనలు కలెక్టర్లకు పంపి దాని ప్రకారం కొనుగోలు చేయిస్తున్నామని రైతులకు ప్రభుత్వం తరఫున మాట ఇస్తున్నామని ప్రతి గింజ మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ప్రకటించారు.
*రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది*
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం నిశ్చయంగా ఉందని,రికార్డు స్థాయిలో ఈసారి ధాన్యం దిగుబడి అయినదని అన్నారు. రైతుల నుండి ప్రతి గింజ కొనుగోలు చేస్తామని ధాన్యం సేకరిస్తామని దీనికోసం 20,000 కోట్లను ప్రభుత్వం సిద్ధం చేసిందని మంత్రిగారు అన్నారు ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా చూస్తామని తెలిపారు.రాష్ట్రంలో 7500 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్ని కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.రైతులకు చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని 500 బోనస్ ఇస్తున్నామన్నారు.రాష్ట్రంలో రెండు కోట్ల 20 లక్షల మందికి ఉచిత బియ్యం ఇవ్వడానికి క్వాలిటీ పెంచామని అందరికీ సంక్రాంతి తర్వాత సన్నబియ్యం ఉచితంగా ఇస్తామని దీనికోసం సన్నబియాన్ని సేకరిస్తున్నామని సన్నబియ్యం సేద్యం చేసేలా రైతులకు 500 రూపాయల బోనస్ ప్రకటించామని అన్నారు.ధాన్యం కొనుగోలు విషయంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.ఉమ్మడి జిల్లాలలో ధాన్యం సేకరణకు సీనియర్ ఐఏఎస్ అధికారులను ఏర్పాటు చేశామని ఈ స్థాయిలో ధాన్యం సేకరణ ఎప్పుడు జరగలేదని మిల్లర్లకు కూడా ఇబ్బంది లేకుండా ధరలు పెంచుతున్నామన్నారు.కేంద్ర ప్రభుత్వం నిబంధనలు కలెక్టర్లకు పంపి దాని ప్రకారం కొనుగోలు చేయిస్తున్నామని రైతులకు ప్రభుత్వం తరఫున మాట ఇస్తున్నామని ప్రతి గింజ మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ లు నాగేశ్వరరావు,జనార్ధన్ రెడ్డి,డీఎస్పీ లు రవి,శ్రీధర్ రెడ్డి,సూర్యాపేట పబ్లిక్ క్లబ్ ఛైర్మెన్ వేణారెడ్డి,సూర్యాపేట డివిజన్ సీఐ లు,ఎస్సై లు,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.