బదిలీపై వెళ్ళిన ఉపాధ్యాయులకు వీడ్కోలు సమావేశం
Mbmtelugunews//హుజూర్ నగర్,నవంబర్ 08 (ప్రతినిధి మాతంగి సురేష్)స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసి బదిలీపై వెళ్ళిన పి దీనారాణి,ఆరె వసంతరావు,రాపోలు నాగేశ్వరావు కి వీడ్కోలు సమావేశం ఘనంగా జరిగింది.అదే విధంగా పదోన్నతి పొంది ఈ పాఠశాలకు వచ్చిన వై సుజాత,డి జనార్ధన్ రెడ్డి,సిహెచ్ రవిందర్ రెడ్డి లకు,నూతనంగా డీఎస్సీ ద్వారా రిక్రూట్ అయిన ఇ జగదీశ్వర్ రెడ్డి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్,కే శ్రీను లకు స్వాగత సన్మానం చేయడం జరిగింది.ఈ కార్వక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిను ఎంఈఓ సైదా నాయక్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనదని విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దుటలో వారి పాత్ర కీలకమైనదని తెలియజేశారు. వృత్తిలో బదిలీలు,పదోన్నతులు సాధారణమైనవని ఎక్కడ- పని చేసినా అక్కడ తల్లిదండ్రుల,విద్యార్థుల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.నూతనంగా వృత్తి లోకి ప్రవేశించిన ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో పాఠశాల హెచ్ఎం పి జయవాణిదేవి,టి శ్రీనివాస్,కే వెంకటేశ్వర్లు,బి శ్రీదేవి,జె ప్రసాద్,ఎం ప్రభాకర్ రావు,పి శేషగిరి,ఎండి అస్మాముబీన్,డి అరుణ,శ్రీకాంత్,కాంతిబాయి మొదలగువారు పాల్గొన్నారు.