దక్షిణ తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా చింతాబాబు మాదిగ.
Mbmtelugunews//కోదాడ,నవంబర్ 09(ప్రతినిధి మాతంగి సురేష్):మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కోదాడకు చెందిన చింతా బాబు మాదిగ నియామకం అయ్యారు.శనివారం హైదరాబాదులో జరిగిన సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ చింతా బాబును ఎమ్మార్పీఎస్ దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏబిసిడి వర్గీకరణకై చింతాబాబు మాదిగ గత 30 సంవత్సరాలుగా మాదిగ జాతి అభ్యున్నతకై అలుపెరుగని పోరాటం చేస్తున్నారని సీనియర్ నాయకుడిగా వారి సేవలను గుర్తించి నియమించినట్లు తెలిపారు.అనంతరం చింతాబాబు మాదిగ మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించినందుకు మేడి పాపయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వారి వెంట రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు,ప్రధాన కార్యదర్శి మరికంటి అంబేద్కర్ మాదిగ,రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ పల్లేటి లక్ష్మణ్ మాదిగ,సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పడిదల రవికుమార్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.