చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి
Mbntelugunews//కోదాడ,నవంబర్ 09(ప్రతినిధి మాతంగి సురేష్):ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని కోదాడ సీనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ కే సురేష్ అన్నారు. జాతీయ న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా శనివారం మండల న్యాయ కోదాడ మండల న్యాయ సేవాదికార సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ,సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయ సహాయం అవసరమైన వారికి సేవాభావం తో సహాయం అందించేందుకు న్యాయ సేవాధికార సంస్థ పని చేస్తుందని అన్నారు.న్యాయ సేవాధికార సంస్థ సేవలను అవసరమైన వారు ఉపయోగించుకోవచ్చినని తెలిపారు.ఈ కార్యక్రమంలో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ చిత్తలూరి సత్యనారాయణ,బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ఆర్కే మూర్తి,ప్రధాన కార్యదర్శి చింతకుంట్ల రామిరెడ్డి,సీనియర్ న్యాయవాదులు మేకల వెంకట్రావు,పాలేటి నాగేశ్వర రావు,ఈదుల కృష్ణయ్య,కత్తి హరిప్రసాద్,బండి వీరభద్రమ్,ఉయ్యాల నరసయ్య,నసీర్,తాటి మురళీ,హేమలత తదితరులు పాల్గొన్నారు.