వనభోజన మహోత్సవం ఏర్పాట్లు పరిశీలించిన కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎర్నేని బాబు.
:కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం కోదాడ వనభోజన మహోత్సవాలకు తరలిరావాలి.
:రేపు ఆదివారం ద్వారకుంట సమీపంలోని ఎర్నేని వెంకటరత్నం బాబు మామిడి తోటలో వనభోజన మహోత్సవ ఏర్పాట్లు పూర్తి.
:కోదాడ నియోజకవర్గం, మేళ్లచెరువు మండలం కమ్మ కుటుంబ సభ్యులకు ఆహ్వానం.
Mbmtelugunews//కోదాడ,నవంబర్ 09(ప్రతినిధి మాతంగి సురేష్):కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు ఆదివారం నిర్వహిస్తున్న కార్తీకమాస వనభోజన మహోత్సవాలకు కోదాడ నియోజకవర్గ మేళ్లచెరువు మండల గ్రామాల కమ్మ కుటుంబ సభ్యులు తరలిరావాలని కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎర్నేని బాబు పిలుపునిచ్చారు శనివారం కోదాడ మండలం ద్వారకుంట సమీపంలోని ఎర్నేని వెంకటరత్నం బాబు మామిడి తోటలో వనభోజన మహోత్సవ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మికతకు ప్రతీకగా ఉన్న కార్తీక మాసంలో వనభోజన మహోత్సవంలో పాల్గొని భగవంతుని ఆశీస్సులు అందరూ పొందాలని కోరారు పూజా కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. లోక కళ్యాణం కోసం ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని జరిగే వనభోజనం మహోత్సవం లో కమ్మ సహోదరులు ఐక్యంగా పాల్గొని సమాజానికి ఆదర్శంగా నిలవాలన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు