Saturday, July 5, 2025
[t4b-ticker]

ప్రాంతీయ పశువైద్యశాలలో పశుఔషధ బ్యాంక్ ప్రారభించిన జిల్లా పశువైద్య,పశు సంరక్షణ అధికారి:డా దాచేపల్లి శ్రీనివాసరావు

ప్రాంతీయ పశువైద్యశాలలో పశుఔషధ బ్యాంక్ ప్రారభించిన జిల్లా పశువైద్య,పశు సంరక్షణ అధికారి:డా దాచేపల్లి శ్రీనివాసరావు

:దాతల సహకారంతో పశుపోషకులకు మందుల పంపిణీ ఎంతో ప్రశంసనీయం.

Mbmtelugunews//కోదాడ,నవంబర్ 14(ప్రతినిధి మాతంగి సురేష్)పశువుల ఆరోగ్యం,పాల దిగుబడి సకాలంలో సూడి మోయడానికి నిరంతరం మేతలో ఖనిజ లవణ మిశ్రమం ( మినరల్ మిక్సర్) పశుపోషకులకు పంపిణీకి పశు ఔషధ బ్యాంక్ లో సిద్ధం.పాడి పశువుల్లో కాల్సియం పాత్ర అతికీలకం- ఇప్పుడు కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలకు వచ్చే పశువులకు ఉచితంగా పంపిణీ-పశుపోషకులకు ఇది ఒక మహదావకాశం,పశు పోషకులు సద్వినియోగం,చేసుకోవాలి-పశు ఔషధ బ్యాంక్ ప్రారంభోత్సవ అనంతరం జిల్లా అధికారి మాట్లాడుతూ ఆలోచన-అమలు కోసం ప్రణాళిక-పట్టుదలతో సాధించి ఆచరణ లో పెట్టడం-పశు ఔషధ బ్యాంక్ ఏర్పాటులో అత్యంత కీలకం-అట్టి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన డా పి పెంటయ్య అని అన్నారు.కోదాడ పరిసర ప్రాంతాలు పశుపోషకులకు విలువైన పాడి పశువులకు ప్రసిద్ధి , అయినప్పటికీ ఎక్కువ శాతం సన్న చిన్న కారు పశుపోషకులు ఆర్ధిక భారంతో తమ పాడి గేదెలకు సరియైన పోషక విలువలతో కూడిన మేతను అందించలేని పరిస్థితి ఉందన్నారు.అత్యంత ఖరీదైన మందులను పశుపోషకులకు చేయూతగా అందించడానికి కోదాడ ప్రాంతీయ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య వినూత్నంగా దాతల సహకారంతో ఏర్పాటుచేసిన పశు ఔషధ బ్యాంక్ ఆలోచన దాని అమలు ఎంతో ప్రశంసనీయమని జిల్లా అధికారి అభినందించారు.ఈ పశు ఔషధ బ్యాంక్ నిర్వహణకు తొలి విరాళంగా డా వై వెంకటరమణారెడ్డి (యూఎస్ఏ లో పశువైద్యులు) తనకు విద్య ,జీవితాన్నిచ్చిన మాతృనేలలోని పశుపోషకులకు తనవంతు సహాయంగా చేయూతనివ్వాలని 50 వేల రూపాయలు అందించగా అట్టి యాబదివేల రూపాయలను రివాల్వింగ్ ఫండ్ గా ఏర్పాటు చేసి కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో జీవిత కాలం పశుపోషకులకు ఖనిజ లవణ మిశ్రమం అందించి, పశు ఆరోగ్యం,పాల దిగుబడి,సకాలంలో తిరిగి చూలు కట్టడానికి ,నర్సింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం,హైదరాబాద్ వారు ప్రత్యేకంగా తయారు చేసిన ఖనిజలవణమిశ్రమాన్ని నిరంతరం పంపిణీకి పశు ఔషధ బ్యాంక్ లో ఏర్పాటు చేయడం జరిగింది.ఈ అవకాశం ఉపయోగించుకోవడం ద్వారా పశుపోషకులు 70 శాతం పశు ఆరోగ్య సమస్యలను అధిగమించి పశుపోషణ లాభసాటిగా చేసుకోవచ్చు అని తెలిపారు,అలాగే కాపుగల్లు గ్రామానికి చెందిన ముత్తవరపు పూర్ణచందర్ రావు తాను సైతం స్వంత నేలకు కొంత సాయం అనే నినాదంతో తమ కాల్సియం తయారీ కంపినీ కాల్సియం టానిక్ సుమారు 50000 వేల రూపాయల విలువగల 500 లీటర్లు కాల్సియం పశుపోషకులకోసం ఉచితంగా అందజేశారని,దానిని ప్రాంతీయ పశువైద్యశాలకు 300 లీటర్లు,చిలుకూరుకు,హుజూర్నగర్ పశువైద్యశాలకు 100 లీటర్ల చొప్పున పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.ఇకనుండి పశ్గువైద్యశాలకు వచ్చే పాడి పశువులకు కాల్సియం టానిక్ ఉచితంగా ఇవ్వబడునని తెలిపారు.ఖనిజ లవణ మిశ్రమాన్ని పశువుకి రోజుకీ యాబడి గ్రాములు ఎల్లప్పుడూ ఇవ్వాలని కాల్సియం పాలిచ్చే పశువులకి రోజుకి 100 గ్రాముల చొప్పున నెలలో పదిరోజులు ఇవ్వాలని తద్వారా అధిక దిగుబడి సాధ్యం అవుతుందని తెలిపారు.ఈరెండు మందులతో నేడు ప్రారంభించిన పశు ఔషధ బ్యాంక్ దాతల సహకారంతో మునుముందు మరిన్ని అత్యవసర ఔషధాలను పశువైద్యశాలకు వచ్చే పశువులకు అందించి పశుపోషకులకు ఆర్ధిక భారం పూర్తిగా తగ్గించబడునని తెలిపారు.ఈ కార్యక్తమములో చిలుకూరు కోదాడ మండల పశువైద్యాధికారులు డా కె వీరారెడ్డి,డా మధు మండల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular