గీత కార్మికుల ఆత్మ రక్షణ కొరకే కాటమయ్య కిట్టు.
:రక్షణ కవచల వలన గీత కార్మికులకు ఎంతో మేలు
:తాడిచెట్టు ఎక్కేటప్పుడు సేఫ్టీమోగులు తప్పనిసరిగా వాడాలి:నలమాద పద్మావతి రెడ్డి.
Mbmtelugunews//కోదాడ,నవంబర్ 15(ప్రతినిధి మాతంగి సురేష్):గీత కార్మికులందరూ వృత్తిలో క్షేమముగా ఉండుట కొరకు సురక్షితమైన జీవితాన్ని గడపాలనే దృడ సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి సేఫ్టీమోకుల పంపిణీకి శ్రీకారం చుట్టారని స్థానిక ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్ పద్మావతిరెడ్డి అన్నారు.శుక్రవారం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి జి అనసూర్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పాల్గొని కాటమయ్య రక్షణ కిట్టులను శిక్షణ పొందిన గీత కార్మికులకు సేఫ్టిమోకులను పంపిణీ చేశారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వృత్తిలో ఉన్న గీత కార్మికులందరికీ ఎలాంటి ప్రమాదం జరగకూడదనే లక్ష్యంతో గీత కార్మికులందరికీ సేఫ్టీమోకులు అందించి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ప్రభుత్వం చొరవ తీసుకుందని తెలిపారు.

సేఫ్టిమోకులు వాడే విధానాన్ని వాటి వల్ల జరిగే లాభాలను కౌండిన్య గౌడ సంఘం జాతీయ అధ్యక్షులు,సీనియర్ న్యాయవాదులు కేఎల్ఎన్ ప్రసాద్ గౌడ్ వివరిస్తూ మాట్లాడారు గీత వృత్తిలో ప్రమాదం జరగకుండా కాపాడుకోవడం కొరకే ఈ కాటమయ్య రక్షణ కిట్టు ఇది మన గీత కార్మికులకెంతో ఉపయోగమని అన్నారు.కోదాడ నియోజకవర్గంలోని 80 మంది గీత కార్మికులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని మిగతా గీత కార్మికులందరికీ శిక్షణ ఇచ్చి సేఫ్టీ మోకులు అందించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సహకారంతో ప్రతి ఒక్కరికి సేఫ్టీ మూకులు అందించడానికి కృషి చేస్తానని కేఎల్ఎన్ ప్రసాద్ అన్నారు.గీత కార్మికుల కృషికి నిరంతరం శ్రమిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి,ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ లక్ష్మణ్ నాయక్,బీసీ వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారి గామయ్య,బీసీ వెల్ఫేర్ సూపరింటెండెంట్ అక్బర్ బాషా,కోదాడ,సూర్యాపేట ఎక్సైజ్ సిఐలు ఎం శంకర్,ఎస్ మల్లయ్య,ఎస్ఐలు యాదగిరి,రామకృష్ణ,గోవర్ధన్,సిబ్బంది,బిసి వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్స్ జ్యోతి,సైదులు,లతీమున్న,నసీమా,త్రివేణి,రాంబాబు,భుజంగం,కల్లు గీత కార్మిక సంఘం సూర్యపేట జిల్లా కార్యదర్శి మడ్డి అంజిబాబుగౌడ్,జిల్లా కమిటీ సభ్యులు బట్టిపల్లి నాగమల్లయ్య,బెల్లకొండ వెంకటేశ్వర్లు,సోమగాని మల్లయ్య,మామిడి వెంకటేశ్వర్లు,గీత కార్మికులు దుశర్ల ప్రకాశం,సుమన్,శీను,వెంకటయ్య,రాంబాబు తదితరులు పాల్గొన్నారు.