Monday, December 23, 2024
[t4b-ticker]

చీకటిమయంలో గొండ్రియాల ఎస్సీ కాలనీ

- Advertisment -spot_img

చీకటిమయంలో గొండ్రియాల ఎస్సీ కాలనీ

:గత నాలుగు నెలలుగా నరకం అనుభవిస్తున్న గొండ్రియాల ప్రజలు

:అకాల వరదలు వచ్చిన నాటి నుండి నేటి వరకు కరెంటు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు

:పాములు,తేళ్లు,దోమలతో బిక్కుబిక్కుమంటున్న ప్రజలు.

:ఎస్సీ కాలనీ పై చవితి తల్లి ప్రేమ చూపిస్తున్న విద్యుత్ శాఖ అధికారులు

:ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోని సంబంధిత అధికారులు,ప్రజాప్రతినిధులు

Mbmtelugunews//కోదాడ/గొండ్రియాల,నవంబర్ 16(ప్రతినిధి మాతంగి సురేష్):గత నాలుగు నెలల క్రితం అనగా జులై 31 రాత్రి కురిసిన అకాల వర్షాలకు  గొండ్రియాల గ్రామంను ఆనుకొని ఉన్న పాలేరు వాగు పొంగి గ్రామం మొత్తం జలమయమయి భారీ నష్టం జరిగిన సంగతి తెలిసిందే.ఈ అకాల వర్షాలకు గ్రామంలోని వాహనాలు,కరెంటు పోల్స్,ట్రాన్స్ఫార్మర్స్,వ్యవసాయ పొలాలు,ఇండ్లలో నిత్యవసర సరుకులు దుస్తులు ఇతరత్రా కొట్టుకొని పోయి భారీ నష్టం జరిగింది.ఆనాటి నుండి నేటి వరకు గత నాలుగు నెలలుగా ఎస్సీ కాలనీలోని ట్రాన్స్ఫార్మర్ పెట్టడంలో సంబంధిత అధికారులు పూర్తిగా విఫలం చెందారని గ్రామస్తులు పోతున్నారు.సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు వేరే ట్రాన్స్ఫార్మర్ కి కలవడంతో లోడ్ ఎక్కువ అయ్యి రాత్రి సమయంలో తరచూ కరెంటు పోతూ ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తుందని వాపోతున్నారు.కరెంటు పోయిన సమయంలో విష సర్పాలు,దోమలతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ బయటికి వెళ్ళని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.

సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న ఎస్సీ కాలనీ పై చవితి తల్లి ప్రేమ చూపిస్తున్నారని పలువురు వాపోతున్నారు.ఇకనైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి కాలనీకి కరెంటు సక్రమంగా వచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని పలువురు వాపోతున్నారు.

*విద్యుత్ శాఖ ఏఈ సీతారాంని చరవాణి ద్వారా వివరణ అడగగా*

అకాల వరదలకు ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకుపోయిన అవి రిపేరు అవుతున్నాయి ఈ రెండు మూడు రోజులలో కరెంట్ ప్రాబ్లం లేకుండా చేస్తామని తెలిపారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular