ఘనంగా కుమ్మరి కుల కార్తీక వన మహోత్సవం…
Mbmtelugunews//కోదాడ,నవంబర్ 17 (ప్రతినిధి మాతంగి సురేష్):కార్తీక మాస వన భోజనాలతో ఆధ్యాత్మిక చింతనతో పాటు ఐక్యతా భావం పెరుగుతుందని బిఆర్ఎస్ నాయకులు మామిడి రామారావు అన్నారు.ఆదివారం పట్టణ పరిధిలోని కొమరబండ గ్రామంలో కార్తీక మాస వనభోజన ఉత్సవాల్లో వారు పాల్గొని మాట్లాడారు.కార్తీకమాసంలో వన భోజనాలు ఆచరించడం పూర్వకాలం నుండి వస్తున్న సనాతన సాంప్రదాయమని,ఏడాదిలో ఒకసారి వనంలో సామూహికంగా భోజనాలు చేయడం సోదర భావాలను పెంచడంతోపాటు పర్యావరణ రక్షణకు ఎంతో దోహదం చేస్తుందన్నారు.అనంతరం ఉసిరిక, అశ్వత్థ, బిల్వ తదితర వృక్షాల నీడలో సామూహింగా భోజనం చేశారు.

ముందుగా కుమ్మరబండ తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ మామిడి పద్మ ఆధ్వర్యంలో గ్రామంలో ఊరేగింపుగా కార్తీకమాస మన భోజనాలకు కుమ్మర కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.ఈ కార్యక్రమంలో కుల పెద్దలు మామిడి జానకి రామారావు,కొలిపాక రామలింగం,కడారు మల్లయ్య,గొల్లపల్లి రాజయ్య ,గొల్లపల్లి చుక్కయ్య,కొలిపాక రామకృష్ణ ఉడుం రాజేష్,బాడిశ మట్టయ్య కుమ్మరి సంఘం నాయకులు,మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.