ఘనంగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎర్నేని బాబు జన్మదిన వేడుకలు……….
:కోలాహలంగా ఎర్నేని జన్మదిన వేడుకలు…..
:ఎర్నేని జన్మదినం సందర్భంగా పేదలకు అన్నదానం……
Mbmtelugunews//కోదాడ,నవంబర్ 20(ప్రతినిధి మాతంగి సురేష్):కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్,మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు జన్మదిన వేడుకలు ఎర్నేని యువసేన ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు.ఎర్నేని టవర్స్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు,వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు ఎర్నేని అభిమానులు భారీగా తరలివచ్చి బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి మిఠాయిలు తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువా,పూలమాలలతో ఘనంగా సన్మానించారు.తమ అభిమాన నాయకుడు ఎర్నేని ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకొని రాజకీయాల్లో ఉన్నతమైన పదవులు అందుకొని పేదలకు వారు మరింత కాలం సేవలు అందించాలని ఆకాంక్షించారు.
అనంతరం పేదలకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎర్నేని కుసుమ, బాబు దంపతులు కలిసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు,జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి,వరప్రసాద్ రెడ్డి,వంటి పులి వెంకటేష్,ముత్తినేని సైదేశ్వరరావు,నెమ్మది దేవమని,రావెళ్ల కృష్ణారావు, వేమూరి విద్యాసాగర్,గరినే శ్రీధర్,డేగ శ్రీధర్,కోటిరెడ్డి,అల్తాఫ్ హుస్సేన్,చేపల భాస్కర్,పంది తిరపయ్య,లైటింగ్ ప్రసాద్,నలజాల శ్రీనివాసరావు,అప్పారావు,బాగ్దాద్,షమీ, తదితరులు పాల్గొన్నారు…