అన్ని వసతులతో విద్యార్థులకు సిద్ధార్థ మెస్.
:నాణ్యమైన భోజనాన్ని అందించాలి.
:సిద్ధార్థ మెస్ నుప్రారంభించిన: టీపీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి
Mbmtelugunews//కోదాడ,నవంబర్ 21(ప్రతినిధి మాతంగి సురేష్):విద్యార్థులకు హాస్టల్ లో అన్ని వసతులు కల్పిస్తూ నాణ్యమైన భోజనాన్ని అందించాలని టిపిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి అన్నారు.గురువారం అనంతగిరి రోడ్ లో పాత ఈవీ రెడ్డి కళాశాల వరణంలో శిల్పి సుధాకర్ ఆధ్వర్యంలో సిద్ధార్థ మెస్,విజయ్ బాయ్స్ హాస్టల్ నూతనంగా ఏర్పాటు చేసినారు.వీటి ప్రారంభోత్సవమునకు ముఖ్య అతిథులుగా టీపీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి,మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్ లు పాల్గొని రిబ్బన్ కట్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్య రంగంలో కోదాడ దిన దినం అభివృద్ధి చెందుతున్నది దానికి అనుగుణంగా అన్నీ వసతులతో విద్యార్థులకు సిద్ధార్థ మెస్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.
ఎంతో దూర ప్రాంతాల నుండి కోదాడలో చదువుకోడానికి వచ్చిన విద్యార్థులకు అన్ని వసతులతో బాయ్స్ హాస్టల్,నాణ్యమైన భోజనాన్ని అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు,ఎర్నేని బాబు,ముత్తవరపు పాండురంగారావు,వక్కవంతుల నాగార్జున,భాషబోయిన భాస్కర్,నలజాల శ్రీనివాసరావు,చింతకుంట్ల మంగమ్మ,దేవరపల్లి మల్లేశ్వరి,ఆవు దొడ్డి ధనమూర్తి,పార సీతయ్య,నెమ్మాది దేవమణి,తోట శ్రీను,అలవాల వెంకట్,పంది తిరుపతయ్య,కళ్యాణ్,రామారావు తదితరులు పాల్గొన్నారు.