సౌత్ జోనల్ విశ్వవిద్యాలయ స్థాయి కబడ్డీ పోటీలకు కెఆర్ఆర్ విద్యార్ధిని ఎంపిక
Mbmtelugunews//కోదాడ,నవంబర్ 21 (ప్రతినిధి మాతంగి సురేష్)మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నల్గొండ లో 19/11/2024 వ తేదీ నిర్వహించిన కబడ్డీ పోటీల్లో యాభైఏడు మంది విద్యార్థులు పాల్గొన్నారు.కెఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బిఏ ప్రథమ సంవత్సరం చదువుతున్న జీ శ్రీజ కబడ్డీ జట్ల ఎంపికలో విజేతగా నిలిచారు.ఈ నెల 29 వ తేదీ నుండి డిసెంబర్ మూడవ తేదీ వరకు అలగప్ప విశ్వవిద్యాలయం పరిధిలో కరైకుడి ప్రాంతం తమిళనాడు రాష్ట్రం లో జరిగే సౌత్ జోనల్ ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో కళాశాల తరుపున జీ శ్రీజ పాల్గొంటారు.ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ డా,, చందా అప్పారావు శ్రీజ ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.భవిష్యత్తులో కళాశాల తరుపున అనేక విజయాలు సాధించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఫ్రాన్సిస్, సహాయా చార్యులు సైదిరెడ్డి,డా,ఎన్ నిర్మల కుమారి,లైబ్రేరియన్ యాకూబ్,కబడ్డీ శిక్షణ నిపుణులు తురక రమేష్ తదితర భోధన,బోధనేతర సిబ్బంది,విద్యార్థులు అభినందనలు తెలియజేశారు.