వెల్లటూరు మాజీ ఏడవ వార్డు మెంబర్ రౌతు గురునాధం (శ్రీను)కి మాతృవియోగం
:సంతాపాన్ని తెలియజేసిన అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు
:అంతిమయాత్రలో భారీ ఎత్తున గ్రామ ప్రజలు
:కుల మతాలకు అతీతంగా పాల్గొన్న గ్రామ ప్రజలు
Mbmtelugunews//హుజూర్ నగర్/మేళ్లచెరువు ,నవంబర్ 22 (ప్రతినిధి చింతారెడ్డి గోపిరెడ్డి)వెల్లటూరు గ్రామం లో గొప్ప పేరు మంచి మనుసున్న వ్యక్తి రౌతు గురునాధం (శ్రీను) గౌడ్ మాజీ 7వ వార్డు నెంబర్ మాతృ మూర్తి రౌతు తిరుపతమ్మ నిన్న నవంబర్ 21 గురువారం రాత్రి 7:30 నిమిషాలకు అనారోగ్యం రీత్య మరణించగా.ఈ రోజు నవంబర్ 22 శుక్రవారం మధ్యాహ్నం 12:00 గంటలకు రౌతు కీర్తి: శే తిరుపతమ్మ అంతిమ యాత్రను వారి బంధు మిత్రులు అంతా కలిసి బ్యాండ్ మేళంతో,టపాసులతో,బంతి పూలతో ఘనంగా అంతిమ యాత్ర చేసి దహన సంస్కారం చేసారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తిరుపతమ్మ మరణం ఆ కుటుంబానికి తీరని లోటు అని అన్నారు వారి మరణం మేళ్లచెరువు,చింతలపాలెం మండల ప్రజలను తీవ్ర దిగ్వానికి గురి చేసిందని వారు అన్నారు.
పలువురు ఆమె పార్థివ దేహంపై పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో వెల్లటూరు గ్రామస్థులు,వారి నీల పార్టీ రౌతు వారు,దాసు వారు,శేషం వారు,ఉసిరికాయల వారు,కారింగులవారు,మడిపల్లి వారు,కీర్తి వారు,కుకడపు వారు,వారి బంధు మిత్రులు మల్లారెడ్డి గూడెం,తమ్మారం,పీక్ల నాయక్ తండా,హుజునగర్ అచ్చం పేట,మాదారం,మేళ్లచెరువు తదితర గ్రామస్థులు,అనేక గ్రామాల నుండి వారి బంధువు మిత్రులు అందరూ అధిక సంఖ్య లో పాల్గొన్నారు.