చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం:కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్
Mbmtelugunews//కోదాడ,నవంబర్ 27(ప్రతినిధి మాతంగి సురేష్):చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ తెలిపారు.బుధవారం సూర్యాపేట జిల్లాలోని కోదాడ డివిజన్ లో బండపాలెం,నల్లబండగూడెం గ్రామంలో ఏర్పాటుచేసిన సన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.బండపాలెంలో ఐకెపి,నల్లబండగూడెం గ్రామంలో పిఎసిఎస్ వారు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి,తేమ శాతం కొలిచే యంత్రం ద్వారా ధాన్యాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని,రైతులు తమ పంట చేతికొచ్చిన తర్వాతనే కోతలు కోయాలని,ముందుగా కోయడం వలన తాలు శాతం ఎక్కువగా ఉంటుందని ఇది రైతులు గమనించాలని కలెక్టర్ కోరారు.కొనుగోలు సెంటర్ లోని గన్ని బ్యాగులను పరిశీలించారు.రైతులను కొనుగోలు కేంద్రాలలో ఏర్పాట్లపై కలేక్టర్ అడిగి తెలుసుకున్నారు.బండపాలెం రైతు మాట్లాడుతూ ఈసారి ధాన్యం కొనుగోలు వద్ద ఏర్పాట్లు బాగున్నాయని కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయని మిల్లుల రవాణా చేయుటకు పెద్ద లారీలు కావాలని రైతులు కలెక్టర్ కోరారు కలెక్టర్ వెంటనే ధాన్యం రవాణా కొరకు లారీలను అలాగే హమాలీల సంఖ్యను పెంచాలని కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణకు ఆదేశించారు.
సన్నధాన్యం బోనస్ 500 రూపాయలు కూడా ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతు ఖాతాలో జమ అవుతాయని కలెక్టర్ పేర్కొన్నారు.రైతుల వివరాలను ఎప్పటికప్పుడు రిజిస్టర్ లో నమోదు చేయాలని రైతులకు బస్తాలు తొందరగా ఇవ్వాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.అనంతరం బండపాలెంలో గల పురాతన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కలెక్టర్ దర్శించారు పూజారులు వేదమంత్రాలతో కలెక్టర్ ని స్వాగతం పలికి దర్శన అనంతరం దేవాలయ పూర్తి చరిత్రను వివరించారు.ఈ కార్యక్రమంలో కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణ,తాసిల్దార్ వాజిద్ అలీ,ఏవో రజిని,ఏఈఓ,సిఈఓ లు పాల్గొన్నారు.