విద్యార్థులకు బహుమతులు అందజేసిన కోదాడ ఎంఈఓ.
Mbmtelugunews//కోదాడ,నవంబర్ 27(ప్రతినిధి మాతంగి సురేష్):మంగళవారం రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో బిఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కర్ల ప్రేమానంద్ ఆధ్వర్యంలో మంగళవారం వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గెలుపొందిన విద్యార్థులకు బుధవారం కోదాడ ఎంఈఓ సలీమ్ షరీఫ్ మరియు విద్యార్థి సంఘం నాయకులు కర్ల ప్రేమానంద్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోదాడ ఎంఈఓ పాల్గొని మాట్లాడుతూ… బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కు ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలి అని అన్నారు.ఇందుకు చదువు ఒక్కటే మార్గం అని ప్రతి విద్యార్ధి ప్రాథమిక హక్కులు అవగాహన ఉండాలి అని ఆయన సూచించారు.వ్యాసరచన పోటీలు నిర్వహించిన కర్ల ప్రేమానంద్ ను ప్రత్యేకంగా అభినందించారు.అనంతరం వ్యాస రచన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు ఎంఈఓ సలీం షరీఫ్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు.