ఫైలేరియా రక్త నమూనాల సేకరణ
:రాత్రి సమయంలో నమూనాల సేకరించిన వైద్య సిబ్బంది
: ఫైలేరియాను అరికట్టడమే ప్రభుత్వ లక్ష్యం
Mbmtelugunews//కోదాడ,నవంబర్ 29(ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు గ్రామంలో ఫైలేరియా టెస్టు నమూనా సేకరణ కార్యక్రమాన్ని డిప్యూటీ డిఎంహెచ్వో నిరంజన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినారు. ఈ సందర్భంగా పి.హెచ్.సి కాపుగల్లు మెడికల్ ఆఫీసర్ ధర్మ తేజ మాట్లాడుతూ కాపుగల్లు గ్రామంలో ఆరు టీములుగా ఏర్పడి ఫైలేరియా బ్లడ్ సేకరణ కార్యక్రమాన్ని గురువారం రాత్రి నిర్వహించామని అన్నారు.
గ్రామంలో అన్ని టీములు కలిపి 300 బ్లడ్ శాంపిళ్లను సేకరించామని అన్నాము. గ్రామంలో మైక్రో ఫైలేరియాను గుర్తించడంలో భాగంగా ముందుగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్యూఓ రామకృష్ణ,సూపర్వైజర్ శ్యాంసుందర్ రెడ్డి,పీహెచ్ఎన్ అన్నమ్మ,ల్యాబ్ టెక్నీషియన్లు,ఏఎన్ఎంలు,హెల్త్ అసిస్టెంట్లు,ఆశా కార్యకర్తలు,ఆర్బిఎస్కే డ్రైవర్లు,గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.