సూర్యాపేట జిల్లా (mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు)తుంగతుర్తి మండలం :తెలంగాణ ఉద్యమకారుడు రిటైర్డ్ ఉద్యోగి తుంగతుర్తికి చెందిన ఓరుగంటి సత్యనారాయణ ఆదివారం అకాల మరణం చెందారు.సత్యనారాయణ పుట్టింది ఆర్యవైశ్య కుటుంబంలో జన్మించిన పట్టుదలతో తెగించి కొట్లాడి తెలంగాణ ఉద్యమంలో తన వయసు ను సైతం లెక్కచేయకుండా నిరంతరం పోరాటం చేశారు.మలి దశ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ఓరుగంటి సత్యనారాయణ పాత్ర ఎనలేనిది,తుంగతుర్తి మండలమే కాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో ప్రజలను ఉద్యోగులను ఆర్యవైశ్యలను చైతన్యవంతం చేసి తెలంగాణ ఉద్యమంలో ముందుండి ఓరుగంటి సత్యనారాయణ పోరాటం చేశారు.తెలంగాణ ఉద్యమం కాకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కూడా నిరంతరం కృషి చేశాడు. ఆయన సేవలు మరువలేనిది ఓరుగంటి సత్యనారాయణ మృతి పట్ల తెలంగాణ ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్యోగులు ఆర్యవైశ్య సంఘం నాయకులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ సత్యనారాయణ మృతి తమకు తీరని లోటు పలువురు నాయకులు మేధావులు పేర్కొన్నారు సమాజంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు.