కాంగ్రెస్ లోకి బిఆర్ఎస్ డిసిసిబి డైరెక్టర్ రంగాచారి
:మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి సమక్షంలో పార్టీ లో చేరిక.
:చేరికలో పాల్గొన్న చింతలపాలెం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నందిరెడ్డి ఇంద్రరెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి దేవిరెడ్డి లక్ష్మారెడ్డి
Mbmtelugunews//హుజూర్ నగర్/చింతలపాలెం, డిసెంబర్ 02 (ప్రతినిధి చింతారెడ్డి గోపిరెడ్డి):తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల,పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ నల్లగొండ జిల్లా డిసిసిబి డైరెక్టర్ వేములూరి రంగాచారి కాంగ్రెస్ పార్టీలో చేరారు.అనంతరం రంగాచారి మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపులో సహకారం అందిస్తానని తిరిగి సొంత ఇల్లు అయిన కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు సంతోషంగా ఉంది అన్నారు.
ఈ చేరికలో ఆయన వెంట గుడిమల్కాపురం మూడో వార్డు మెంబర్ గంగారపు రాముడు కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో చింతలపాలెం కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నంది రెడ్డి ఇంద్రారెడ్డి,జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దేవిరెడ్డి లక్ష్మారెడ్డి,నాగార్జున రెడ్డి, ప్రసాద్,బాలు,కోట్య, మహేష్,రాజు,షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.