వాలీబాల్ యూనివర్సిటీ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థి తోట శ్యామ్ ను అభినందిస్తున్న ప్రిన్సిపాల్,అధ్యాపకులు
:సౌత్ జోనల్ విశ్వవిద్యాలయ స్థాయి వాలీబాల్ పోటీలకు కెఆర్ఆర్ విద్యార్ధి ఎంపిక
Mbmtelugunews//కోదాడ,డిసెంబర్ 09(ప్రతినిధి మాతంగ సురేష్):మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నల్గొండ లో 08/12/2024 ఆదివారం రోజున న నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో యూనివర్సిటీ పరిధిలోని అన్ని కళాశాల నుంచి 75 మంది విద్యార్థులు పాల్గొన్నారు.అందులో భాగంగా కెఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బిఏ ప్రథమ సంవత్సరం చదువుతున్న తోట శ్యామ్ వాలీబాల్ పోటీల ఎంపికలో యూనివర్సిటీ తరఫున ఎంపికయ్యాడు.ఈ నెల 18 వ తేదీ నుండి 22 తేదీ వరకు కేరళ రాష్ట్రంలోని కేరళ విశ్వవిద్యాలయం లో జరిగే సౌత్ జోనల్ ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో మహాత్మా గాంధీ యూనివర్సిటీ తరుపున కెఆర్ఆర్ ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాల బిఏ మొదటి సంవత్సరం విద్యార్థి తోట శ్యామ్ పాల్గొంటారు.ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హడ్స రాణి మేడం విద్యార్థి తోట శ్యామ్ ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపి యూనివర్సిటీల స్థాయిలో జరిగే పోటీల్లో గెలిచి పతకంతో తిరిగి రావాలని కోరారు.అలాగే భవిష్యత్తులో కళాశాల తరుపున జరిగే వాలీబాల్ పోటీలలో పాల్గొని అనేక విజయాలు సాధించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఫ్రాన్సిస్,వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ చందా అప్పారావు,లైబ్రేరియన్ యాకూబ్,అధ్యాపకులు పల్లపాటి సైదులు,ఎస్ఎమ్ రఫీ,కేలోతు సైదులు,మల్లయ్య,నాన్ టీచింగ్ సిబ్బంది సైదులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.