కోదాడ ఐఎంఏ ఆధ్వర్యంలో ఘనంగా ఐఎంఏ 50 వసంతాల వేడుకలు
Mbmtelugunews//కోదాడ,డిసెంబర్ 11 (ప్రతినిధి మాతంగి సురేష్):ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏర్పడి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కోదాడ ఐఎంఏ ఆధ్వర్యంలో సీనియర్ డాక్టర్ల సన్మాన కార్యక్రమాన్ని స్థానిక కేఎస్ఆర్తో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏర్పాటు చేసినారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.ఇండియన్ మెడికల్ అసోసియేషన్-కోదాడ’ అధ్యక్షుడిగా డాక్టర్ ఎం.వి సుబ్బారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.నూతనంగా ఏర్పడిన కార్యవర్గంతో పాటు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్థాపించి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఐఎంఏ గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
అనంతరం సీనియర్ డాక్టర్లను ఐఎంఏ ఆధ్వర్యంలో సన్మానించారు.నూతనంగా కార్యవర్గ సభ్యులు ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె జనార్దన్ రావు,ఉపాధ్యక్షుడు డా, బిఎస్ జె మనోహర్,కోశాధికారి డా, పి పుల్లారావు,జాయింట్ సెక్రటరీ: డా,వి రాజేంద్రప్రసాద్,డా,ఎస్ లక్ష్మణ్,డా, ఎం ప్రవీణ్,డా, పొట్లూరి సుమంత్,డా, పి రాధిక,డా, వై పార్ధసారధి, మహిళా వైద్యుల ఫోరమ్ ప్రతినిధి డాక్టర్ ఎం వనజ,కార్యనిర్వాహక మండలి సభ్యులు డాక్టర్ సుజాత మనోహర్,డా,ఎన్.వి.రాఘవరావు,డా,ఎస్ అశోక్ కుమార్,డాక్టర్ కె నిర్మల,డాక్టర్ టి చెన్నారావు,డాక్టర్ బి సైదా,డాక్టర్ జి నాగమణి లను ఎన్నుకొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు డాక్టర్ ఎం లక్ష్మీ ప్రసాద్,డాక్టర్ బి.వి.ఎస్. ప్రసాద్ లు పాల్గొన్నారు.