వైజ్ఞానిక ప్రదర్శనలు పరిశోధనలకు నాంది పలకాలి
:సైన్స్ లేకపోతే జీవితమే లేదు..
:విద్యార్థులు తల్లిదండ్రుల కలలు సహకారం చేయాలి…
:విద్యతోనే సమాజంలో గుర్తింపు..
:శాస్త్రవేత్తలకు పుట్టినిల్లు భారతదేశం..
:కోదాడలో నింగికేసిన బాల వైజ్ఞానిక ప్రదర్శన వేడుకలు.
:వైజ్ఞానిక ప్రదర్శనలతో కదం తొక్కిన విద్యార్థులు.
:విద్యార్థుల ప్రయోగాలు రాష్ట్ర జాతీయస్థాయిలో ప్రథమ స్థానంలో నిలవాలి.
:సూర్యాపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ రాంబాబు.
Mbmtelugunews//కోదాడ,డిసెంబర్ 19(ప్రతినిధి మాతంగి సురేష్):వైజ్ఞానిక ప్రదర్శనలు పరిశోధన రంగాలకు నాంది పలకాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు.గురువారం కోదాడ పట్టణంలోని సీసీ రెడ్డి పాఠశాలలో సూర్యాపేట జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 52వ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన ప్రారంభించి మాట్లాడారు.సమాజానికి మనుగడ సైన్స్ అండ్ టెక్నాలజీ అని అన్నారు. సైన్స్ లేకపోతే జీవితమే లేదని విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభిరుచిని పెంచుకొని లక్ష్యాలను సాధించాలన్నారు. విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు.తల్లిదండ్రులు తమ పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు ఉపాధ్యాయులు శాస్త్రవేత్తలు కావాలని కలలు కంటున్నారని వారి కలలను సాకారం చేయాలన్నారు.భారతదేశం శాస్త్రవేత్తలకు పుట్టినిల్లు అన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలకు జీవితాన్ని దారం పోసిన అబ్దుల్ కలాం వంటి శాస్త్రవేత్తల యొక్క ఆశయాలను శాసించాలన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో అర్హతలు ఉన్న ఉపాధ్యాయులు ఉన్నారని కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు విద్యానందిస్తున్నాయన్నారు.ప్రతిభకు పేదరికం అడ్డు కాదని విద్యతోనే సమాజంలో గుర్తింపు వస్తుందన్నారు.సూర్యాపేట జిల్లా విద్యార్థుల వైజ్ఞానిక ప్రయోగాలు రాష్ట్ర జాతీయస్థాయిలో ప్రథమ స్థానంలో నిలవాలన్నారు.ప్రతిష్టాత్మకంగా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ను ఆయన అభినందించారు.
సభాధ్యక్షులు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరులను విజ్ఞాన శాస్త్రం పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఈ వైజ్ఞానిక ప్రదర్శన దోహదపడుతుందన్నారు.జిల్లావ్యాప్తంగా 23 మండలాల నుండి 84 ఇన్స్పైర్ అవార్డుల ప్రయోగాలు, 312 ప్రదర్శనలు పలు పాఠశాలల నుండి ప్రదర్శనలు వచ్చాయని తెలిపారు. వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటుకు సహకరించిన ప్రజాప్రతినిధులకు ఉపాధ్యాయ సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు.కాగా ప్రదర్శనకు ముందు విద్యార్థులు నిర్వహించిన గౌరవ వందనాన్ని స్వీకరించారు అనంతరం విద్యార్థుల ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించి విద్యార్థులను ప్రోత్సహించారు.వైజ్ఞానిక ప్రదర్శన లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అంబరాన్ని అంటాయి.వైజ్ఞానిక ప్రదర్శన గురు శుక్రవారాల్లో కొనసాగుతుందని ఆయన చెప్పారు.డివో అశోక్ అధ్యక్షతన జరిగిన.
ఈ కార్యక్రమంలో తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య,జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు,ఆర్డీవో సిహెచ్ సూర్యనారాయణ,మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్,మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు,జిల్లా సైన్స్ అధికారి ఎల్ దేవరాజ్,మున్సిపల్ కమిషనర్ రమాదేవి,ఎంపీడీవో రామచంద్రరావు,ఎంఈఓ సలీం షరీఫ్,ఛాత్రు నాయక్,కౌన్సిలర్ గంధం యాదగిరి,పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు,సైన్స్ ఫెయిర్ కమిటీల కన్వీనర్లు,కో కన్వినర్లు,సభ్యులు,ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు