కోదాడ సహకార సంఘాన్ని సందర్శించిన నాబార్డ్ ప్రతినిధులు.
:బంగారం పై 1% తక్కువ వడ్డీతో ఋణాలు
:సహకార సంఘాల ద్వారా రైతుల శ్రేయస్సు కొరకు రుణాలు
Mbmtelugunews//కోదాడ,డిసెంబర్ 20(ప్రతినిధి మాతంగి సురేష్):కోదాడ సహకార సంఘాన్ని శుక్రవారం నాబార్డ్ ప్రతినిధులు తనిఖీ చేసి సహకార సంఘం అందిస్తున్న సేవలను రైతులకు ఇచ్చుచున్న రుణాలను గోల్డ్ లోన్ లు,స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించి తృప్తి చెందారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు సకాలంలో ఇస్తున్న రుణాలను,సకాలంలో రుణాలు చెల్లించిన వారికి త్రీ పర్సెంటేజ్ తిరిగి రైతుకి వడ్డీ ఇవ్వటం జరుగుతుంది,రైతులకు కమర్షియల్ బ్యాంకుల కన్నా కూడా బంగారం పై 1% తక్కువ వడ్డీతో రైతుల శ్రేయస్సు కొరకు రుణాలు ఇవ్వడం జరుగుతున్నది.
అటువంటి బ్యాంకు కేవలం సహకార బ్యాంకు మాత్రమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ పీఏసీఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి,నాబార్డ్ ప్రతినిధులు అనురాగ్ శర్మ,నల్లగొండ జిల్లా సహకార బ్యాంక్ శ్రీనివాస్,కోదాడ బ్రాంచ్ మేనేజర్ కృష్ణ,ఆడిటర్ రామకృష్ణ,వైస్ చైర్మన్ గుడికి నరేష్ కుమార్,మంద వెంకటేశ్వర్లు,స్టాప్ రైతులు పాల్గొన్నారు.