Monday, December 23, 2024
[t4b-ticker]

కులమతాలకు అతీతంగా సెమి క్రిస్మస్

- Advertisment -spot_img

కులమతాలకు అతీతంగా సెమి క్రిస్మస్

:ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో సెమి క్రిస్మస్

Mbmtelugunews//కోదాడ,డిసెంబర్ 20(ప్రతినిధి మాతంగి సురేష్):కోదాడ పట్టణంలోని బస్టాండ్ సమీపంలోని బాలురు ఉన్నత పాఠశాలలో కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్న గౌడ్ హాజరై క్రిస్మస్ కేక్ కట్ చేసి,స్వీట్లు పంచారు.ఈసందర్భంగా అంజన్ గౌడ్ మాట్లాడుతూ అన్ని మతాల సారం ఒకటేనని మత విద్వేషాలు విడనాడి తోటి వారితో సోదర భావంతో మెలుగుతూ క్రీస్తు మార్గంలో పయనించాలి తోటి వారికి తోడ్పాటు అందించడమే క్రీస్తు బోధనల సారాంశం అన్నారు.క్రీస్తు జీవితం అందరికీ ఆదర్శనీయమని చెప్పారు.క్రైస్తవం అనేది ఒక మతం కాదు అదొక జీవన విధానం క్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పండుగను ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.నిరుపేదలకు ఎల్లప్పుడూ తమ వంతు సహాయ,సహకారాలు అందిస్తామన్నరు.కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీఎస్ఐ పాస్టర్ యన్.పాల్,ముస్లిం మతపెద్ద హామీద్ మౌలానా,జర్నలిస్టులు గాంధీ,పూర్ణ,వెంకటనారాయణ,లక్ష్మణ్,నాగరాజు,మైముద్,నజీర్,నరేష్,వీరబాబు,రామకృష్ణరహీం,శ్రీహరి,పవన్,భాస్కర్,సైదులు,నాగేంద్రబాబు,రామకృష్,నాయకులు పందితిరపయ్య,శ్రీకాంత్,రహీం,నజీర్,తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular