Monday, December 23, 2024
[t4b-ticker]

చనిపోయిన ఆశా కార్యకర్తల కుటుంబాలకు న్యాయం చేయాలి:మధుబాబు

- Advertisment -spot_img

చనిపోయిన ఆశా కార్యకర్తల కుటుంబాలకు న్యాయం చేయాలి:మధుబాబు

Mbmtelugunews//కోదాడ,డిసెంబర్ 21(ప్రతినిధి మాతంగి సురేష్):అనారోగ్య కారణాలతో లేదా,ప్రమాదవశాత్తు విధులలో ఉన్న ఆశా కార్యకర్తలు చనిపోతే వారి కుటుంబ సభ్యులలో అర్హులైన ఒకరికి ఆశా కార్యకర్తగా అవకాశం కల్పించాలని వారి కుటుంబానికి న్యాయం చేయాలని తెలంగాణ వైద్య మరియు ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం హెచ్1 ఐఎన్టియుసి అనుబంధ సంఘ యూనియన్ జిల్లా అధ్యక్ష మరియు ప్రధాన కార్యదర్శులు బూతురాజు సైదులు మరియు
యాతాకుల మధుబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా కోదాడ పట్టణంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ గ్రామ స్థాయిలో పనిచేసే ఆశ కార్యకర్తలు ప్రభుత్వoచే నిర్దేశించబడ్డ అనేక జాతీయ ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను ప్రజలకు చేర వేయిటలో కీలకపాత్ర వహిస్తున్నారని అటువంటి వారికి ప్రభుత్వం అండగా ఉండాలని తెలిపారు,వారికి ఆరోగ్య భీమా,ప్రమాద బీమా కల్పించాలని కోరారు, వీటితోపాటు వారు ఉద్యోగ పరంగా ఎదుర్కొన్న అనేక సమస్యలను పరిష్కరించాలని,అర్హత ఉన్న ఆశా కార్యకర్తలకు ఏఎన్ఎం ఉద్యోగం ఇవ్వాలని,ఆశా కార్యకర్త చనిపోతే మట్టి ఖర్చులు కింద 25 వేల రూపాయలు అందించాలని డిమాండ్ చేశారు.చనిపోయిన ఆశా కార్యకర్తలలో అర్హులైన వారికి కలెక్టర్ తో మాట్లాడి ఉద్యోగం ఇప్పించేందుకు కృషి చేస్తానని కోదాడ శాసనసభ్యులు నలమాద పద్మావతి రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిపారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular