కోదాడ బాప్టిస్ట్ చర్చిలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు
Mbmtelugunews//కోదాడ,డిసెంబర్ 23(ప్రతినిధి మాతంగి సురేష్):స్థానిక నయానగర్ లోని కోదాడ బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్ ఈ యేసయ్య ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.మందిరమును విద్యుత్ దీపాలతో అలంకరించి వీధులలో క్రిస్మస్ గుర్తుగా ఉన్న అతిపెద్ద స్టార్ ను ఆవిష్కరించారు.జూమ్ మీటింగ్ ద్వారా దైవజనులు జయకర్ పవిత్ర వాణిలు చిన్న పిల్లలకు బైబిల్ వాక్యమును బోధించారు.
చర్చి గాయనీ గాయకులు ప్రత్యేకమైన పాటలు పాడి ప్రభువును మహిమ పరిచారు.చిన్నపిల్లలు స్కిట్స్ మెమొరీ వర్షిప్ చేసినారు.ఇవి చూసిన భక్తులు ఎంతగానో అలరించారు.చర్చ్ పెద్దలు వచ్చిన భక్తులకి శుభాకాంక్షలు తెలియజేసి ఒకరినొకరు ఆప్యాయతతో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి సండే స్కూల్ పిల్లలకు క్రిస్మస్ గిఫ్ట్స్ అందించారు.ఈ సందర్భంగా పాస్టర్ యేసయ్య మాట్లాడుతూ క్రిస్మస్ ఒక అన్వేషణ అని క్రిస్మస్ అంటే ఆరాధన అని ఆనందమని ప్రతి ఒక్కరూ క్రిస్మస్ పండుగను సంతోష సమాధానాలతో ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం క్రిస్టియన్ కో ఆప్షన్ సభ్యులు ఒంటెపాక జానకి ఏసయ్య సంఘ సభ్యులు క్రిస్మస్ కేక్ కట్ చేసి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపల్ క్రిస్టియన్ కోఆప్షన్ సభ్యులు వంటెపాక జానకి ఏసయ్య,జాన్ మోజాస్,శ్యాంబాబు,జగ్గు నాయక్,మేరమ్మ,రాంబాబు,తబిత,సునీత,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.