కోదాడ పట్టణ,నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు:చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి
Mbmtelugunews//కోదాడ,డిసెంబర్(ప్రతినిధి మాతంగి సురేష్):25:ప్రేమాభావం,సేవాతత్పరతను,క్షమా గుణాన్ని బోధించిన క్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పండుగను క్రైస్తవులు సంతోషంగా జరుపుకోవాలని టీపీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి ఆకాంక్షించారు.ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు జరుపుకునే క్రిస్మస్ పండుగ సందర్భంగా కోదాడ పట్టణ,నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదర సోదరీమణులకు టీపీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత సంతోషకరమైన రోజు అన్నారు.క్రిస్మస్ పండుగ వేళ అందరికీ శుభం కలగాలని ఆ యేసు ప్రభును ప్రత్యేకంగా ప్రార్థించారు.క్రీస్తు దీవెనలు అందరికీ చేకురాలని.క్రైస్తవులు యేసు ప్రభువు చూపిన మార్గంలో పయనిస్తూ,ప్రపంచ శాంతి కోసం ప్రార్థించటం గొప్ప విషయం అన్నారు.క్రిస్టియన్ సోదర,సోదరీమణులు ఆనందోత్సహాలతో క్రిస్మస్ ను జరుపుకోవాలని కోరారు.