ఘనంగా క్రీస్తు జన్మదిన వేడుకలు
:ప్రపంచ దేశాలు జరుపుకొనే పండుగ క్రిస్మస్ పండుగ:చింతకుంట్ల లక్మినారాయణ రెడ్డి,కేఎల్ఎన్ ప్రసాద్
Mbmtelugunews//కోదాడ,డిసెంబర్ 25(ప్రతినిధి మాతంగి సురేష్):కాంగ్రెస్ నాయకులు పంది తిరుపతయ్య ఆధ్వర్యంలో క్రీస్తు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.టిపిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి నివాసంలో,ప్రముఖ న్యాయవాది,కాంగ్రెస్ నాయకులు కేఎల్ఎన్ ప్రసాద్ నివాసంలో కేక్ కట్ చేసి క్రీస్తు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రేమాభావం,సేవాతత్పరతను,క్షమా గుణాన్ని బోధించిన క్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పండుగను క్రైస్తవులు సంతోషంగా జరుపుకోవాలని అన్నారు.

ప్రపంచ దేశాలు మొత్తం జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ ఈ పండుగను క్రైస్తవులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని అన్నాడు.అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపి పంది తిరుపతయేను శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు,మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు,సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్న గౌడ్,డేగ శ్రీధర్,డాక్టర్ బ్రహ్మం,పంది కళ్యాణ్,కాసర్ల సత్యరాజు,గుగులోతు సురేష్,సుధాకర్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.