ఆలోచన ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ ప్రేమ విందు
Mbmtelugunews//చిలుకూరు,డిసెంబర్ 25(ప్రతినిధి మాతంగి సురేష్):ఆలోచన ఫౌండేషన్ చైర్మన్ మొలుగూరి నాగరాజు ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రేమ విందు కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డిఎస్పి మామిళ్ళ శ్రీధర్ రెడ్డి,ఎస్వి విద్యాసంస్థల చైర్మన్ ముత్తినేని సైదేశ్వర రావు,చిలుకూరు ఎస్ఐ సురభి రాంబాబు గౌడ్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీస్తు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ప్రేమ విందు ఏర్పాటుచేసిన మొలుగూరి నాగరాజును అభినందించారు. క్రిస్మస్ క్రీస్తు జన్మదిన వేడుకలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో చెన్నారి గూడెం గ్రామ మాజీ సర్పంచులు కొవ్వూరి బాబాయ్,కొవ్వూరు వెంకటేశ్వర్లు,గంటా శ్రీనివాస్,సీనియర్ జర్నలిస్టు సోమపంగు గణేష్,అంబటి సైదిరెడ్డి,గట్టు వీరయ్య,పంచాయతీ కార్యదర్శి గుండప్పనేని రామారావు గారు చిన్న సైదులు,గట్టు లింగయ్య,సారెడ్డి బిక్షం రెడ్డి,నెమ్మాది కృష్ణయ్య,పారేలి పీరయ్య,పారెల్లి మహేష్,బొడ్డుపల్లి పుల్లయ్య,నాగటి రాములు,సాతులూరి గురవయ్య,అక్కెనపల్లి జానకి రామాచారి,పాస్టర్స్ రేపల్లె సేమ్ ఆనంద్,తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు.