ఉద్యోగంలో ఉత్తమ సేవలు అందించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: కౌన్సిలర్ శివ సుబ్బారావు
Mbmtelugunews//కోదాడ,డిసెంబర్05(ప్రతినిధి మాతంగి సురేష్):స్థానిక గణేష్ నగర్ 18వ వార్డు కు చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ పొతబత్తిని ఏసుదాస్ కుమారుడు పొతబత్తిని నాగేంద్రబాబు సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్ నందు విధులలో చేరిన సందర్భంగా 18 వ వార్డుకు చెందిన పెదనాటి నరసింహారావు అధ్యక్షతన వార్డు ప్రజలు నాగేంద్రబాబు కు సన్మాన కార్యక్రమం శనివారం రాత్రి ఏర్పాటు చేయడమైనది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 18వ వార్డు కౌన్సిలర్ కర్రి శివ సుబ్బారావు పాల్గొని నాగేంద్రబాబును ఘనంగా శాలువా పూలమాలతో సత్కరించారు.అనంతరం వారు మాట్లాడుతూ కానిస్టేబుల్ ఉద్యోగంలో ఉత్తమ సేవలు అందించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరినారు.అనంతరం సావిత్రిబాయి పూలే జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని గణేష్ నగర్ లో ఉన్న మహిళా ఉపాధ్యాయులైన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు సలీమా బేగం,స్కూల్ అసిస్టెంట్ రత్నకుమారి,పద్మావతి,చంద్రకళ,జయలలిత,జ్యోతి లను ఘనంగా సన్మానించుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు మాతంగి ప్రభాకర్ రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఈ సంవత్సరం జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవమును భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయునిరాలు సావిత్రిబాయి పూలే పేరును ప్రభుత్వం ప్రకటించడం అభినందనీయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో వార్డు పెద్దలు ప్రకాష్ రెడ్డి,మాధవి,మస్తాన్,ఏసుదాస్,శ్రీనివాసరెడ్డి,రామకోటేశ్వరరావు,విన్సెంట్,నరేష్,నాగేశ్వరరావు,వెంకటేశ్వర్లు,గణేష్,సుబ్బారావు,వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.