నగరాలకు ధీటుగా కోదాడ అభివృద్ధి కావడం అభినందనీయం
:వ్యాయామానికి,మానసిక ఉల్లాసానికి స్విమ్మింగ్ పూల్స్.
:ఆత్మరక్షణకు ఈత నేర్చుకోవాలి.
:ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి.
Mbmtelugunews//కోదాడ,జనవరి 06(ప్రతినిధి మాతంగి సురేష్):నగరాలకు ధీటుగా కోదాడ పట్టణం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెంద డం అభినందనీయమని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ అన్నారు.ఆదివారం కోదాడ పట్టణంలోని అనంతగిరి రోడ్ లో రంగన్న గుడి వెనుక ఏర్పాటు చేసిన రాయల్ స్విమ్మింగ్ పూల్ ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. కోదాడలో అత్యధిక సదుపాయా లతో స్విమ్మింగ్ పూల్ ని ఏర్పాటు చేయడం అభినం దనీయమన్నారు.స్విమ్మింగ్ శారీరక వ్యాయామం మానసిక ఉల్లాసం కలుగుతాయి అన్నారు.దీర్ఘకా లిక వ్యాధులు ఊబకాయం తగ్గేందుకు స్విమ్మింగ్ దివ్య ఔషధం అన్నారు.వీటితోపాటు ఆత్మరక్షణకు ఈత ఎంతో దోహదపడుతుందన్నారు. ఈత పిల్లలకు ఎంతో అవసరం ప్రతి ఒక్కరూ పిల్లలకు ఈతపై అవగాహన కల్పించి ఇతనేర్పించాలనీ అన్నారు.

నిర్వాహకులయిన సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ యూత్ ఉపాధ్యక్షులు మహమ్మద్ అజాజుద్దీన్ నాణ్యమైన సేవలు అందించి స్విమ్మింగ్ పూల్ ను అభివృద్ధి చేసుకోవాలన్నారు.ఈ కార్యక్ర మంలో టిపిసిసి డెలిగేట్ సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వర రావు, బాగ్దాద్ ఈదుల కృష్ణయ్య, చింతలపాటి శ్రీనివాసరావు,మహమ్మద్ అబ్దుల్ అజీమ్ తదితరులు పాల్గొన్నారు.