Friday, July 4, 2025
[t4b-ticker]

స్వయం ఉపాధి సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

స్వయం ఉపాధి సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

:స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ద్వారా మహిళలు అభివృద్ధి పథంలో ముందుకు పోవాలి

:ఏజీఎం ఇండస్ట్రీ కంపెనీని ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

Mbmtelugunews//కోదాడ ,జనవరి 06(ప్రతినిధి మాతంగి సురేష్):స్వయం ఉపాధి సంఘాలు మహిళా ఇందిరా శక్తి ద్వారా చిన్న తరహా పరిశ్రమలు నిర్మించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని స్థానిక శాసనసభ్యురాలు నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం పట్టణ పరిధిలోనే రెండోవ వార్డ్ లక్ష్మిపురం లో ఇందిరా మహిళా శక్తి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో హలో క్లీన్ లిక్విడ్ (ఏజీఎం) ఇండస్ట్రీ ప్రారంభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పాల్గొని మాట్లాడుతూ మహిళలు ఇందిరా మహిళా శక్తి ద్వారా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు.హలో క్లీన్ లిక్విడ్స్ ఇండస్ట్రీని ఏర్పాటు చేసిన గౌసియా బేగం ను అభినందించారు.ఇలాంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లు ఏర్పాటు చేసుకొని మహిళలు అన్ని రంగాల్లో ముందుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు.

అనంతరం షేక్ గౌసియా బేగం మాట్లాడుతూ మా హలో క్లీన్ లిక్విడ్స్ ద్వారా మేము డిటర్జెంట్ లిక్విడ్,డిష్ వాష్ లిక్విడ్,ఫ్లోర్ క్లీన్ లిక్విడ్,ఫినాయిలు,యాసిడ్,ఫ్యాబ్రిక్ కండిషనర్,షాంపూ,హెయిర్ ఆయిల్,బాత్రూమ్ లిక్విడ్స్ వంటి ప్రోడక్ట్లను అతి తక్కువ ధరలకు అందిస్తున్నామని అన్నారు.మాకు సహకరిస్తున్న ఇందిరా మహిళా శక్తి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ వారికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్,వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు,బషీర్ కౌన్సిలర్ గంధం యాదగిరి,సైదాబాబు,మస్తాన్,మెప్మా ఆర్పీలు మాధవి,ధనలక్ష్మి,అనూష,సంఘ సభ్యులు సైదాబీ,అస్మా,గౌస్య,రహిమూన్,సునీత,చెన్ను,మైబూబి తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular