యువత వ్యాపార రంగాలలో ముందుండాలి:కుక్కల మహేష్
Mbmtelugunews//ఖమ్మం,జనవరి 07 (ప్రతినిధి మాతంగి సురేష్) యువత స్వయం ప్రతిపత్తితో వ్యాపార రంగాలను ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కుక్కల మహేష్ అన్నారు.ఖమ్మం రూరల్ మండల పరిధిలోని పెద్దతండా లో చాయ్ దునియా టీ పాయింట్ ప్రారంభ కార్యక్రమాన్ని మేకల వెంకటేష్,మడిపల్లి ప్రశాంత్ లు ఏర్పాటు చేసినారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కుక్కల మహేష్,యువం ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ కుక్కల రాజాలు పాల్గొని టీ పాయింట్ ని ప్రారంభించారు.

అనంతరం వారు మాట్లాడుతూ యువత వ్యాపారణంగాలను ఎంచుకొని ఆర్థికంగా ఎదగాలని వారన్నారు. యువత వ్యాపార రంగాలను ఎంచుకోవడం వలన చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా వ్యాపార అలవాట్లను అలవర్చుకుంటారని అన్నారు.ఈ కార్యక్రమంలో కొలికపొంగు వినోద్ రైనా,బానోత్ హరి,మహాదేవ్,జిమ్ పృథ్వి,పోలోజు కిరణ్,నగేష్,ఐనప మహేష్,యోగేష్ తదితరులు పాల్గొన్నారు