రాష్ట్రవ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి శోభ
:భక్తులతో కిటకిటలాడతున్న వైష్ణవ ఆలయాలు.
:శ్రీవారి నామ స్మరణలతో మారి మోగుతున్న ఆలయాలు.
తెలంగాణ జనవరి 10(ప్రతినిధి ముజీబ్):రాష్ట్రవ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి శోభ కనిపిస్తుంది.వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాలు దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం.దీనిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రవ్యాప్తంగా వైష్ణవ ఆలయాలు శ్రీవారి నామ స్మరణతో మారిపోయి పోతున్నాయి.దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.ఉదయం తెల్లవారుజామునించే స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు.తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన భద్రాచలం శ్రీరాములూరి ఆలయం,యాదాద్రి నరసింహస్వామి ఆలయం,వేములవాడ రాజన్న ఆలయం,హైదరాబాద్ లని వైష్ణవ ఆలయాలు,చిలకలూరి బాలాజీ ఆలయం,వరంగల్,నిజామాబాద్,బోధన్,బాన్సువాడ,ఎల్లారెడ్డి,సిద్దిపేట్,సంగారెడ్డి,జహీరాబాద్,మెదక్, ధర్మపురి,కొండగట్టు, మహబూబ్నగర్,కరీంనగర్,జగిత్యాల,ఖమ్మం,మహబూబాబాద్,ప్రముఖ వైష్ణవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని శ్రీవారి దర్శనానికి ఉత్తర ద్వారం నుంచి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు.వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తరం ద్వారం నుంచి ఆ శ్రీవారిని దర్శించుకుంటే ఏడాదంతా సుఖ సంతోషాలతో ఉంటామని భక్తుల విశ్వాసం,దీనిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రవ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ తిరుమల దేవస్థానం,నిజామాబాద్ పట్టణంలోని వేణుగోపాల ఆలయం,కామారెడ్డి లోని వేణుగోపాల ఆలయం,ఎల్లారెడ్డి లోని బాలాజీ ఆలయం,బాన్స్వాడ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం,మద్నూర్ లోని వెంకటేశ్వర ఆలయం,పొతంగల్లు లోని వెంకటేశ్వర ఆలయం, బోధన్ లోని శ్రీ వెంకటేశ్వర ఆలయం వైకుంఠ ఏకాదశి శోభ కనిపిస్తుంది.వైష్ణవ ఆలయంలోని భక్తులతో సందడిగా మారాయి.ప్రముఖులు శ్రీవారి ని ఉత్తరం ద్వారం నుంచి దర్శించుకున్నారు.బైరపూర్ లోని విఠలశ్వర ఆలయం లో వైకుంఠ ఏకాదశి శోభ కనిపించింది.ఉదయం తెల్లవారుజాము నుంచే వైష్ణవ ఆలయంలో దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఇటీవల తిరుపతిలో జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకొని ఆలయాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులకు ఆ శ్రీవారి దర్శనం సులభంగా అందే విధంగా ఏర్పాట్లు చేశారు.ప్రతి ఆలయాల వద్ద పోలీస్ బలగాలను ఏర్పాటు చేసి క్యూ పద్ధతిలో భక్తులను ఆలయాలకు పంపిస్తున్నారు.భక్తులు కావలసిన మంచినీట సౌకర్యం ఏర్పాటు చేశారు.మరి కొన్నిచోట్ల ఏకాదశి ఫలహారం అందజేస్తున్నారు.నిజామాబాద్ బాలాజీ ఆలయంలో అంగరంగ వైభవంగా వేడుకలు కొనసాగుతున్నాయి.