దైవసమాన వానరాన్ని రక్షించిన కోదాడ వాసి భాస్కర్
Mbmtelugunews//కోదాడ,జనవరి 28 (ప్రతినిధి మాతంగి సురేష్)కోదాడ పట్టణం శ్రీవిద్యా కాలేజ్ వీది లోని భాస్కర్ ఇంటి ఆవరణలోకి భుజానికి దవడకి గాయాలతో ఒక కోతి వచ్చి నడవడానికి ఇబ్బంది పడుతూ మనుష్యులని దగ్గరకు రానివ్వకుండా భయపెడుతూ మెడ పట్టేసి కదలకుండా నొప్పులతో బాధపడుతుంటే ప్రాంతీయ పశువైద్యశాలకి ఇంటి యజమాని వెళ్లగా సహాయ సంచాలకులు డా పి పెంటయ్య అనంతగిరిలో పశు గర్భకోశ వ్యాధుల చికిత్సా శిబిరానికి వెళ్లారని సిబ్బంది వెప్పగా చరవాణి ద్వారా అసిస్టెంట్ డైరెక్టర్ ని సంప్రదించగా అసిస్టెంట్ డైరెక్టర్ తక్షణ చికిత్సకు సిబ్బందిని పంపించారు.కానీ కోతిని పట్టుకోవడానికి ఎవరూ సహకరించకపోవడం తో వైద్యం అందించలేకఅదే విషయాన్ని డా పెంటయ్యకి తెలుపగా మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడి వారి సిబ్బందిని పంపించగా వారు సైతం కోతిని పట్టుకోలేక పోయారు.తదుపరి ఫారెస్ట్ అధికారులను సంప్రదించి సహాయం కోరగా కోతులను పట్టుకునే నిపుణులు తమవద్ద అందుబాటులో లేరు అని చెప్పారు.

మధ్యాహ్నం క్యాంపు నుండి వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య కోతి ఉన్న ఇంటికి వెళ్లి దానిని మెల్లగా మచ్చిక చేసుకొని నొప్పి నివారణ మందు స్ప్రే చేసి చాకచక్యంగా గోనె బస్తాతో కోతి తలపైనుండి వేసి పట్టుకొని తన సిబ్బందితో ఇంజక్షన్లు వేశారు.ఉదయనుండి ఆపసోపాలు పడ్డ కోతికి ఎట్టకేలకు వైద్యం అందించి ఉపశమనం కలిగించారు.ఈ కోతి కోసం ఉదయం నుండి తిండి తిప్పలు లేకుండా అనుక్షణం తపించి కలెక్టర్ కి సైతం సమాచారం అందించి దానిని రక్షించడానికి చొరవ చూపిన భాస్కర్ మానవత్వం అభినందనీయమని డా పి పెంటయ్య అన్నారు.చికిత్సా కార్యక్రమములో కోదాడ మండల పశువైద్యాధికారి డా మధు,కాపుగల్లు పశువైద్యాధికారి డా సురేందర్,ప్రాంతీయ పశువైద్యశాల సిబ్బంది రాజు,సాగర్,రిక్షిత్ తదితరులు పాల్గొన్నారు.