11వ తరగతి (ఇంటర్మీడియట్) నవోదయ ఎంట్రన్స్ పరీక్ష ఏర్పాట్లు పూర్తి……
ఫిబ్రవరి 8 తేదీన నవోదయ ఎంట్రన్స్ పరీక్ష……
Mbmtelugunews//కోదాడ,ఫిబ్రవరి 07 (ప్రతినిధి మాతంగి సురేష్)ఫిబ్రవరి 8 ఎనిమిదో తేదీన శనివారం నాడు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నవోదయ ఎంట్రన్స్ ప్రవేశ పరీక్ష 2025 జరుగుతుందని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల కోదాడ(సెంటర్ కోడ్ 34 06 10) యందు పరీక్షలు నిర్వహణ చీఫ్ సూపరింటెండెంట్ గుడిబోయిన రాజు,సెంటర్ లెవెల్ అబ్జర్వర్ డి మార్కండేయ శుక్రవారం నాడు పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు.పరీక్ష నిర్వహణకు సంబంధించిన ఇన్విజిలేటర్స్ శిక్షణ సమావేశం నిర్వహించి పరీక్ష నిర్వహణ సూచన సలహాలు వివరించినారు.పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్ తో సెంటర్ నకు ఉదయం 10 గంటల వరకు చేరుకోవాలని తెలియజేశారు.కోదాడలో 3 సెంటర్లలో బాలికల ఉన్నత పాఠశాల,సిసి ఆర్ స్కూలు,బాలుర ఉన్నత పాఠశాల యందు పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు .