స్వేరోస్ పలకరింపు కార్యక్రమం
:కడుపు చల్ల కార్యక్రమం
:కల్లు సారా మద్యంతో కాదు పండ్లు పండ్ల రసాలు చల్లతో పలకరింపు
Mbmtelugunews//కోదాడ,ఫిబ్రవరి 09(ప్రతినిధి మాతంగి సురేష్):కోదాడ మండల పరిధిలోని గణపవరం గ్రామంలో గత కొద్ది రోజుల క్రితం బలుగూరి చిరంజీవి మృతి చెందిన సంఘటన తెలిసినదే.వారి కుటుంబాన్ని పరామర్శించడానికి స్వేరోస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో స్వేరోస్ పలకరింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్వేరోస్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మామిడాల ప్రవీణ్ కుమార్,స్వేరోస్ రాష్ట్ర అధ్యక్షులు వీరన్నలు పాల్గొని మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం నిర్వహించడం మానవ పరిణామ క్రమంలో జన్మించిన వాడు మరణించక తప్పదు మరణం సర్వసాధారణం అతి చిన్న వయసులో చిరంజీవి మరణం మనందరిని తీవ్ర మనోవేదనకు అంతులేని బాధను కలిగిస్తుంది. ఈ సందర్భంగా చిరంజీవి భార్య సంధ్య కి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని నా తరఫున స్వేరోస్ నెట్వర్క్ తరఫున వ్యక్తం చేస్తున్నానన్నారు.

వాస్తవానికి ఇలాంటి కార్యక్రమం భారత దేశంలో కేవలం స్వేరో నెట్వర్క్ మాత్రమే చేపడుతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.సాధారణ జనజీవనంలో వారి ఆరోగ్యాలను నిలబెట్టుటకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని నేను నమ్ముతున్నాననారు.ఒకరోజు ఒక చర్చలో డాక్టర్ ఆర్ఎస్పి దృష్టికి వచ్చిన సమస్యకు పరిష్కారం కార్యక్రమం.ఈ కార్యక్రమంలో చేపట్టడం కు స్ఫూర్తి అని అన్నారు.ఒక నిరుపేద కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడు అకాల మరణం సంభవిస్తే బంధుమిత్రులు ఆ బాధ్యత కుటుంబం నేపథ్యంలో ఆ బాధిత కుటుంబ సభ్యులను మందు,కల్లు,సారతో వివిధ విధానాల ద్వారా మరచిపోవుటకు అందిస్తున్నారు ఈ క్రమంలో మద్యం తీసుకోవడం వలన మరొక సభ్యుని కోల్పోవాల్సి వచ్చింది ఈ విషయంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి తెలిసి ఎంతో మనోవేదనకు గురైనారు ఈ సందర్భంగా కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిన చందం గా తయారవుతుంది కాబట్టి ఈ సమస్యకు పరిష్కారమునకు జనాలలో సమాజంలో అవగాహన కల్పించి వారిని జాగృతం చేయవలసిన అవసరం ఉందని భావించారన్నారు.అదేవిధంగా డాక్టర్ ఆర్ఎస్పి ఇచ్చిన స్ఫూర్తితో స్వేరోస్ పలకరింపు కార్యక్రమంను కల్లు,మద్యం,సారతో కాకుండా పండ్లు,పండ్లరసాలు,చల్లతో అనే ట్యాగ్ లైన్ తో చేపడుతున్నామని అన్నారు.మనం చనిపోయిన వారిని తీసుకురాలేమో కానీ బాధలో ఉన్న బాధితుల ఆరోగ్య స్థితిగతులను ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుటకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని అన్నారు.మనిషి మందుకు ఎలా బానిస అయినాడు అంటే పుట్టుక నుండి చావు దాకా ప్రతిక్రియకు మందు అలవాటుగా మారింది మందును మనిషి బాధలో సంతోషంలో ఒక తారక మంత్రంలా ఉపయోగిస్తున్నాడు కానీ ఆ మంత్రం తనమును కాటేస్తుందని విషయం మాత్రం మనిషి గుర్తించడం లేదన్నారు.అనంతరం వారి కుటుంబ సభ్యులకు పండ్లు చల్ల అందించడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో స్వేరోస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దారమళ్ళ ప్రకాష్,స్వేరో రాష్ట్ర నాయకులు సదన్న,ఆరెకంటి మల్లన్న,స్వామి,శ్రీనివాస్,సుభద్ర,శ్యామల,మచ్చ నరసయ్య,జగన్,ప్రకాష్,దేవన్న,కిరణ్,ఉషన్న,సుంకరి రమేష్,సూర్యాపేట జిల్లా అధ్యక్షులు వీరాస్వామి,నాగార్జున,రాకేష్ పాల్గొన్నారు.