ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలి!
Mbmtelugunews//కోదాడ,ఫిబ్రవరి 11(ప్రతినిధి మాతంగి సురేష్):స్థానిక లాల్ బంగ్లాలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 20వ తారీకున హైదరాబాదులో జరిగే బహిరంగ సభ కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా పార్టీ డివిజన్ కార్యదర్శి పోటు లక్ష్మయ్య పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేయడంలో కాలయాపన చేస్తున్నారని అన్నారు.ఆనాడు అధికారంలోకి రాకముందు 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన రేవంత్ రెడ్డి,14 నెలల కాలం గడుస్తున్నా నేటికీ ఒక్క ఫ్రీ బస్సు తప్ప మిగతా ఏ హామీని పూర్తిస్థాయిలో అమలు చేసినటువంటి పరిస్థితి లేదు,మాటలకు చేతలకు పొంతన లేనటువంటి విధంగా పరిపాలన కొనసాగుతున్నదని ఎద్దేవా చేశారు.ప్రజల పక్షాన సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తారీకున హైదరాబాదులో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయాలని చలో హైదరాబాద్ పిలుపునివ్వడం జరిగిందని,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరారు.కల్లబొల్లి మాటలతో కాలం వెలదీయక చిత్తశుద్ధితో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేని పక్షంలో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పడుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అరుణోదయ జిల్లా అధ్యక్షుడు ఉదయగిరి,ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు కామల్ల నవీన్, కుమార్,ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి వి నరసింహారావు,కామల్ల శ్రీను,అలుగుబెల్లి సత్యనారాయణ రెడ్డి,పోకల మైసయ్య,విజయ్,వీరబాబు,రవితేజ,నాగేష్,నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.