ప్రతి విద్యార్థిలో ఉన్న ప్రతిభను వెలుకతీయటమే రేస్ కళాశాల లక్ష్యం
:జాతీయస్థాయిలో ర్యాంకులు సాధించిన రేస్ ఐఐటి అకాడమీ.
:జేఈఈ మెయిన్స్ ఫలితాలలో రేస్ ఐఐటి మెడికల్ అకాడమీ ప్రభంజనం…
:కార్పొరేట్ కు దీటుగా కోదాడ రేస్ కాలేజీలో అత్యుత్తమ ఫలితాలు..
:స్వర్గీయ బాణాల వెంకటరెడ్డి ఆశయ సాధన మేరకు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నాం…
:రేస్ ఐఐటి అకాడమీ చైర్మన్ బాణాల వసంత వెంకటరెడ్డి….
Mbmtelugunews//కోదాడ,ఫిబ్రవరి 12 (ప్రతినిధి మాతంగి సురేష్) దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ ప్రవేశాల కొరకై నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు జాతీయస్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించినట్టు కోదాడ రేస్ ఐఐటి అకాడమీ చైర్మన్ బాణాల వసంత వెంకటరెడ్డి తెలిపారు.బుధవారం కళాశాలలో అత్యధిక పర్సంటైల్ సాధించిన విద్యార్థులు ఎస్ దీక్షిత 98.79, పి సూర్య ప్రకాష్ 98.43,ఎస్ డి హుజాఫా 98.34,పి రోహిత్ రెడ్డి 98.02,సిహెచ్ కేఎస్ స్వరూప్ రెడ్డి 96.14,కే మణికంఠ 96.12,పి వంశీ 96.11 పర్సంటైల్ సాధించిన విద్యార్థులను తల్లిదండ్రులు,అధ్యాపకులతో కలిసి అభినందించి విలేకరుల సమావేశంలో మాట్లాడారు స్వర్గీయ బాణాల వెంకట్ రెడ్డి ఆశయాల సాధన మేరకు ప్రతిభ కలిగిన పేద విద్యార్థులు విద్యకు దూరం కాకుండా ఉండాలని గ్రామీణ ప్రాంత పేద,మధ్యతరగతి విద్యార్థులకు అందుబాటు ఫీజులతో గత ఎనిమిది సంవత్సరాల క్రితం గొప్ప ఆశయంతో కోదాడలోనే రేస్ కళాశాల స్థాపించి కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నామని తెలిపారు.

బాణాల వెంకటరెడ్డి మన మధ్య లేనప్పటికీ ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో మాకు ఎదురవుతున్న సమస్యలను అధిగమిస్తూ కష్టాలను నష్టాలను ఎదుర్కొని పక్కా ప్రణాళిక అంకితభావంతో తమ కళాశాల అధ్యాపకులు పనిచేయడం వల్ల ఈ విజయం సాధ్యమైందన్నారు.గతంలో కూడా అనేక ప్రవేశ పరీక్ష ఫలితాలలో తమ రేస్ కళాశాల విద్యార్థులు అగ్రస్థానంలో నిలిచారని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కృష్ణారావు, త్రివేణి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సిరికొండ శ్రీనివాసరావు విద్యార్థుల తల్లిదండ్రులు అధ్యాపకులు పాల్గొన్నారు.