దేశ రక్షణలో అమర జవాన్ ల త్యాగం మరువలేనిది- ఎస్ఐ వాసా ప్రవీణ్ కుమార్
:తెలంగాణ ఎక్స్ సెంట్రల్ ఆర్మ్ డ్ ఫోర్స్ పర్సనల్ వెల్ఫేర్ అసోసియేషన్,వాసవి యూత్ క్లబ్ ల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ
Mbmtelugunews//సూర్యాపేట,ఫిబ్రవరి 14(ప్రతినిధి మాతంగి సురేష్):దేశ రక్షణలో అమరులైన సైనికుల త్యాగం మరువలేనిదని,వారి సేవలు వెలకట్టలేనివని సూర్యాపేట పట్టణ ఎస్ఐ వాసా ప్రవీణ్ కుమార్ అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుండి తెలంగాణ ఎక్స్ సెంట్రల్ ఆర్మ్ డ్ ఫోర్స్ పర్సనల్ వెల్ఫేర్ అసోసియేషన్,వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో పుల్వామా ఉగ్రవాదుల దాడిలో అమరులైన వీర జవాన్ల సంస్మరణార్ధం కొవ్వొత్తులతో నిర్వహించిన శాంతి ర్యాలీని ఆయన ప్రారంభించారు.అనంతరం కల్నల్ సంతోష్ బాబు విగ్రహంకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
2019 ఫిబ్రవరి 14న జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు భీకర దాడికి తెగబడ్డారని అన్నారు.ఈ ఘటనలో 40 మంది జవానులు అమరులయ్యారని అన్నారు.వీరమరణం పొందిన అమర జవాన్ల సేవలను దేశ ప్రజలు ఎన్నటికీ మరవరని అన్నారు.ఈ కార్యక్రమంలో సీఆర్పిఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎస్ఎల్ఎన్ నాయక్,వైస్ ప్రెసిడెంట్ జెపి యాదయ్య,జనరల్ సెక్రెటరీ పి చంద్రయ్య,మాజీ సైనికులు సిహెచ్ జయరాజ్,షేక్ అబ్దుల్ ఖాదర్,ఏ నాగయ్య,ఏఎస్ఐ వి ముత్తయ్య,కె వీరస్వామి,కె జానయ్య,ఎమ్ఎల్ఎన్ రెడ్డి,ఇమ్మడి సోమయ్య,డి నాగులు,వాసవి యూత్ క్లబ్ అధ్యక్షుడు వెంపటి రవితేజ,యమా సంతోష్,పబ్బతి వేణుమాధవ్,బికుమల కృష్ణ,గుమ్మడవెల్లి శ్యామ్,మైలవరపు సతీష్,శ్రీరంగం రాము, ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.