ప్రభుత్వ పాఠశాలల మధ్య భాగస్వామ్యం సమన్వయం పునర్వ్యవస్థీకరణ వ్యూహాలు ఉండాలి: ఎంఈఓ సలీం షరీఫ్
Mbmtelugunews//కోదాడ,మార్చి 01(ప్రతినిధి మాతంగి సురేష్):ప్రభుత్వ ఉన్నత పాఠశాల హుజూర్ నగర్ విద్యార్థులతో పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు మాతంగి ప్రభాకర్ రావు,కొండా వెంకటేశ్వర్లు బృందం టీన్వింగ్ ఆఫ్ స్కూల్స్ కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల కోదాడను సందర్శించడం జరిగినది.ఈ కార్యక్రమం కార్యక్రమంలో మండల విద్యాధికారి సలీం షరీఫ్ పాల్గొని మాట్లాడుతూ ఆయా పాఠశాలలో విద్యాబోధన,తరగతి గదులు,బోధనా పద్ధతులు,విద్యా సామర్ధ్యాలు,పాఠశాలలో ఉన్న మౌలిక సదుపాయాలు,లైబ్రరీ,సైన్స్ ప్రయోగశాలలు,ఆట స్థలము,విద్యార్థుల క్రమశిక్షణ,ప్రభుత్వ విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు ప్రత్యేకతల గురించి సందర్శించిన బృందానికి చూపించి తెలియజేశారు.ఈ సందర్భాన కార్యక్రమ నిర్వహణ ద్వారా పాఠశాలల పునర్వ్యవస్థీకరణ కోసం మెరుగైన విధానాలు రూపకల్పనకు దారి తీస్తుందని అభిప్రాయపడినారు.ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ బాలుర కోదాడ ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు మీనాక్షి,ఉపాధ్యాయులు పద్మావతి,బడుగుల సైదులు,మస్తాన్,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.