Saturday, July 5, 2025
[t4b-ticker]

అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

Mbmtelugunews//కోదాడ,మార్చి 02(ప్రతినిధి మాతంగి సురేష్):అనంతగిరి మండల పరిధిలోని అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజీ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అరుణ హాస్పిటల్ వారి సౌజన్యంతో అనంతగిరి గ్రామంలోని గవర్నమెంట్ హై స్కూల్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జనరల్ ఫిజీషియన్ డాక్టర్ బాలాజీ దాసరి,డాక్టర్ శ్రీకాంత్ గొర్రె,ఆడవారికి,చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ గాయత్రి ప్రియ,ఖమ్మం పట్టణంలోని మ్యాక్స్ విజన్ కంటి హాస్పిటల్ వారు 165 మందికి పరీక్షించి కొందరికి రక్త పరీక్షలు,ఈసీజీ అందరికీ ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది.ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి సురేష్ కుమార్ మాట్లాడుతూ ఇటువంటి వైద్య శిబిరముల ద్వారా నిరుపేదల మీద ఆర్థిక భారం తగ్గుతుందని,ఉచితంగా తమ యొక్క ఆరోగ్య సమస్యలు తగుముఖం పడతాయని అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కళాశాల వైస్ ప్రెసిడెంట్ కే జయపాల్ రెడ్డి మాట్లాడుతూ ఇట్టి సమాజసేవ కార్యక్రమము తమ కళాశాల యొక్క ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమాన్ని వెనక నుండి తోడ్పాటు అందించినటువంటి స్వచ్ఛంద సంస్థలకు,అరుణ హాస్పిటల్ వారికి,మీడియా ప్రతినిధులకు తమ కృతజ్ఞతలు తెలిపారు.అనురాగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి చరవాణి ద్వారా అభినందించారు.ఇదే విధముగా మున్ముందు కూడా అనేక సమాజసేవ కార్యక్రమాలు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో యాజమాన్య ప్రతినిధులు కే పాండురంగ ప్రసాద్,ఎం భూపతి రావు,ఎన్ఎస్ఎస్ విద్యార్థి విభాగం పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ విభాగం ఆఫీసర్ హెచ్ వెంకటేశ్వరరావు,ఫిజికల్ డైరెక్టర్ పికనకయ్య,కే నాగరాజు పర్యవేక్షించారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular