సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ను పరిశీలించిన కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ బృందం
Mbmtelugunews//కోదాడ,మార్చి 03(ప్రతినిధి మాతంగి సురేష్):సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ను కోదాడ మార్కెట్ చైర్ పర్సన్ ఏపూరి తిరుపతమ్మ సుధీర్,వైస్ చైర్మన్ బషీర్ బృందం సోమవారం పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేట మార్కెట్ లో రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలు పశువులు అమ్మకాలు ఎలా జరుగుతున్నాయి అని పరిశీలించామన్నారు.చిరుధాన్యాలు అయిన పెసర,కంది,పచ్చి బఠాణి,చనగకాయలు ఇతరత్రా ధాన్యాలను పరిశీలించామన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బషీర్,కార్యదర్శి రాహుల్,డైరెక్టర్లు మల్లు వెంకట్ రెడ్డి,గునుగుంట్ల శ్రీనివాస రావు,పొలంపల్లి వెంకటేశ్వర్లు,రాపాలి శ్రీను,చింతకుంట్ల సూర్యం,తమ్మనబోయిన వీరబాబు,జొన్నలగడ్డ మణెమ్మ,దొంగల నాగ వేణు,పోతుగంటి అభిరామ్ పాల్గొన్నారు